NHAI Deputy Manager Recruitment 2022: భారత ప్రభుత్వ రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI).. డిప్యూటీ మేనేజర్లు (టెక్నికల్) పోస్టుల (Deputy Manager Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 50
పోస్టుల వివరాలు: డిప్యూటీ మేనేజర్లు (టెక్నికల్) పోస్టులు
పే స్కేల్: నెలకు రూ.39,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించరాదు.
అర్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే యూపీఎస్సీ నిర్వహించిన 2021 ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ (సివిల్)లో రాత పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్ రాసి ఉండాలి.
ఎంపిక విధానం: యూపీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ 2021 స్కోర్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జులై 13, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.