భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్‌లోనున్న నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ (ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ) పరిధిలోని వివిధ స్కూల్స్/సెంటర్ ఆఫ్ స్టడీస్‌లో.. 71 ఫ్యాకల్టీ (ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫోరెన్సిక్ సైన్సెస్, మెడికో-లీగల్ స్టడీస్, సైబర్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్స్, మేనేజ్‌మెంట్ స్టడీస్, పోలీస్ సైన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్, లా, ఫోరెన్సిక్ జస్టిస్ అండ్ పాలసీ స్టడీస్, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, సైకాలజీ, బిహేవియరల్ సైన్స్, ఓపెన్ లెర్నింగ్ విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో టీచింగ్/రీసెర్చ్ అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయోపరిమితి 34 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 6, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.500లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. స్క్రీనింగ్ టెస్ట్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.1,59,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.