భారత ప్రభుత్వ స్పేస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్.. 19 రిసెర్చ్ సైంటిస్ట్, రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్/బీఈ/బీటెక్/ఎంఎస్సీ/ఎంఈ/ఎంటెక్/పీజీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే యూజీసీ నెట్/గేట్/ఎన్-జెట్‌లో వ్యాలిడ్ ర్యాంక్ సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు పోస్టును బట్టి 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్న వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 30, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్ధులకు రూ.850, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులకు రూ.175లు దరఖాస్తు రుసుముగా చెల్లించవల్సి ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.31,000ల నుంచి రూ.1,77,500ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.