
ఇండియన్ రైల్వే పరిధిలోని నార్త్ ఈస్టర్న్ రైల్వే (NER).. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ యూనిట్లలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 1104 అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 15వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాల ఈ కింద చెక్ చేసుకోండి..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో పదో తరగతి, ఐటీఐలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి: 2025 అక్టోబర్ 16వ తేదీ నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు, పీహెచ్ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ ఆధారంగా నవంబర్ 15, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.100 చొప్పున చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు. ఎలాంటి రాత పరీక్షలేకుండానే విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.ఎంపికైన వారికి నిబంధనల మేరక స్టైపెండ్ చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది నోటిఫికేషణ్‌లో తెలుసుకోవచ్చు.
నార్త్ ఈస్టర్న్ రైల్వేలో అప్రెంటిస్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.