NEET UG Re-Exam Admitcard: నీట్‌ యూజీ 2024 రీఎగ్జామ్‌కు అడ్మిట్‌కార్డులు విడుదల! పేపర్ లీక్ సంగతేంటంటూ రగడ..

|

Jun 21, 2024 | 8:13 AM

ఎంబీబీఎస్, బీడీఎస్‌ వంటి పలు వైద్య కోర్సుల్లో 2024-25 ప్రవేశం కోసం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) యూజీ 2024కు సంబంధించి ఓ వైపు అక్రమాలు తవ్వేకొద్దీ బయటపడుతుంటే.. గ్రేస్‌ మార్కులు తొలగించిన విద్యార్ధులు మళ్లీ నీట్‌ పరీక్ష నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. గ్రేస్‌ మార్కులు తొలగించిన 1563 మంది విద్యార్ధులకు నీట్ రీ ఎగ్జాం నిర్వహించేందుకు తాజాగా..

NEET UG Re-Exam Admitcard: నీట్‌ యూజీ 2024 రీఎగ్జామ్‌కు అడ్మిట్‌కార్డులు విడుదల! పేపర్ లీక్ సంగతేంటంటూ రగడ..
NEET UG 2024 Controversy
Follow us on

న్యూఢిల్లీ, జూన్‌ 21: ఎంబీబీఎస్, బీడీఎస్‌ వంటి పలు వైద్య కోర్సుల్లో 2024-25 ప్రవేశం కోసం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) యూజీ 2024కు సంబంధించి ఓ వైపు అక్రమాలు తవ్వేకొద్దీ బయటపడుతుంటే.. గ్రేస్‌ మార్కులు తొలగించిన విద్యార్ధులు మళ్లీ నీట్‌ పరీక్ష నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. గ్రేస్‌ మార్కులు తొలగించిన 1563 మంది విద్యార్ధులకు నీట్ రీ ఎగ్జాం నిర్వహించేందుకు తాజాగా అడ్మిట్‌ కార్డులు విడుదల చేసింది. ఈ విద్యార్ధులందరికీ జూన్‌ 23న పరీక్ష నిర్వహించి ఇదే నెల 30న ఫలితాలు వెల్లడిస్తామని ఇప్పటికే కేంద్రం సుప్రీం కోర్టుకు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ దిశగా అన్నీ ఏర్పాట్లు కూడా చేస్తోంది. మరో రెండు రోజుల్లో పరీక్ష నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.

నీట్‌ యూజీ 2024 రీఎగ్జామ్‌ అడ్మిట్‌కార్డుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరోవైపు నీట్ యూజీ పరీక్ష పేపర్‌ పరీక్ష ముందు రోజు తమకు అందిందని బిహార్‌లో అరెస్టయిన ముగ్గురు విద్యార్ధులు పోలీసుల ఎదుట చెప్పడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో నీట్ రీ ఎగ్జాం నిర్వహణ సాధ్యమేనా అంటూ తర్జనభర్జనలు పడుతున్నారు. బీహార్‌లో అరెస్టయిన నలుగురు విద్యార్ధుల్లో అభిలాషి అనురాగ్ యాదవ్, అతని మామ సికందర్‌ ద్వారా తనతోపాటు మరో ఇద్దరు విద్యార్ధులకు కూడా సమాధానాలతో కూడిన క్వశ్చన్‌ పేపర్‌ అందినట్లు పోలీసులు ఎదుట అంగీకరించాడు. దీంతో నీట్ పేపర్‌ లీకేజీ జరిగినట్లు స్పష్టమవుతుంది. సుప్రీంకోర్టు నీట్‌ యూజీ పరీక్షను రద్దు చేసి, మళ్లీ దేశ వ్యాప్తంగా పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.