
హైదరాబాద్, జనవరి 11: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ ( NEET UG ) 2026 పై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక ప్రకటన వెలువరించింది. నీట్ యూజీ 2026 సిలబస్‌ను జనవరి 10న విడుదల చేసింది. గతంలోనే నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ (UGMEB) ద్వారా సిలబస్‌ను నోటిఫై చేసింది. అయితే ఈ ఏడాదికి నీట్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల ప్రయోజనం ఎన్టీయే అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి సిలబస్‌ను అందుబాటులో ఉంచింది.
నీట్ యూజీ 2026 కొత్త సిలబస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాగా NEET UG అనేది దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో MBBS, BDS ఇతర అనుబంధ ప్రోగ్రామ్‌లతో సహా అండర్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సులలో ప్రవేశానికి నిర్వహించే ఏకైక జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష. NEET UG 2026 రాయాలనుకునే అభ్యర్థులు NEET UG 2026కి సంబంధించిన మరిన్ని అప్‌డేట్‌లు, వివరణాత్మక సూచనలు, నోటీసుల కోసం అధికారిక NTA వెబ్‌సైట్‌ను nta.ac.in లేదా NEET UG పోర్టల్ neet.nta.nic.in ని క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సూచించారు.
గత ఏడాది అంటే 2025లో NEET UG పరీక్షను మే 4న నిర్వహించారు. 2024లో మే 5, 2023లో మే 7న NEET UG పరీక్షలు నిర్వహించారు. ఇక ఈ ఏడాది కూడా మే నెలలోనే నీట్ యూజీ ప్రవేశ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. నీట్ యూజీ-2026 కొత్త సిలబస్‌కు సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లోని అంశాలను యూనిట్ల వారీగా వివరాలను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నీట్ యూజీ 206 రాత పరీక్ష తేదీని అధికారికంగా ప్రకటించవల్సి ఉంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.