NEET UG 2025 Top Ranker: నీట్ యూజీ ఫలితాల్లో ఆల్‌ ఇండియా టాప్‌ ర్యాంకర్‌ ఇతడే.. ఎన్ని మార్కులొచ్చాయో తెలుసా?

వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ యూజీ 2025 పరీక్ష ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ మేరకు నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి స్కోర్‌ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..

NEET UG 2025 Top Ranker: నీట్ యూజీ ఫలితాల్లో ఆల్‌ ఇండియా టాప్‌ ర్యాంకర్‌ ఇతడే.. ఎన్ని మార్కులొచ్చాయో తెలుసా?
NEET UG Top Ranker

Updated on: Jun 15, 2025 | 6:24 AM

హైదరాబాద్‌, జూన్‌ 15: దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ యూజీ 2025 పరీక్ష ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ మేరకు నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి స్కోర్‌ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే నీట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) యూజీ 2025 పరీక్ష ఫైనల్‌ ఆన్సర్‌ కీని కూడా నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) విడుదల చేసింది. తుది కీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఫైనల్‌ కీని విడుదల చేసిన కొద్ది సేపటికే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నీట్‌ ఫలితాలను వెబ్‌ సైట్‌లో ఉంచింది. అభ్యర్ధులు ర్యాంకు కార్డులతోపాటు ఆన్సర్‌ కీ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

నీట్‌ యూజీ 2025 స్కోర్ కార్డు డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

కాగా దేశవ్యాప్తంగా మొత్తం 5,453 పరీక్ష కేంద్రాల్లో మే 4వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల మధ్య నీట్‌ యూజీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా దాదాపు 22.7 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం అభ్యర్ధుల్లో 9.65 లక్షల మంది పురుష అభ్యర్థులు, 13.1 లక్షల మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. తాజా ఫలితాల్లో దాదాపు 12 లక్షల మందికిపైగా నీట్‌ యూజీ క్వాలిఫై అయ్యారు. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఎంబీబీఎస్‌ (MBBS), బీడీఎస్‌, బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహిస్తారు. మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు యేటా ఈ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇంగ్లిష్‌, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 స్థానిక భాషల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

టాప్ 10 ర్యాంకర్లు వీరే..

తాజాగా విడుదలైన నీట్ యూజీ ఫలితాల్లో రాజస్థాన్‌కు చెందిన మహేష్ కుమార్ 99.9999547 పర్సంటైల్ స్కోరుతో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్‌ సాధించాడు. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌కు చెందిన ఉత్కర్ష్ అవధియా సెకండ్‌ ర్యాంకు, మహారాష్ట్రకు చెందిన కృషాంగ్ జోషి థార్డ్ ర్యాంకు కైవసం చేసుకున్నారు. టాప్ 10 ర్యాంకుల్లో ఢిల్లీ, గుజరాత్, పంజాబ్, మహారాష్ట్రకు చెందిన జనరల్ కేటగిరీ అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. ఈ ఫలితాల్లో టాప్‌ 10 ర్యాంకుల్లో ఈసారి తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు చోటు దక్కలేదు. అయితే టాప్‌ 100లో తెలంగాణ విద్యార్థులు పలు ర్యాంకులు సాధించారు. టాప్10 ర్యాంకర్లందరూ జనరల్ కేటగిరీకి చెందిన వారేకావడం మరో విశేషం. టాప్‌ 10లో ఓ అవికా అగర్వాల్ అనే అమ్మాయి కూడా ఉంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.