Telugu News Education Career Jobs NEET UG 2025 counselling registration begins for MBBS and BDS admissions: Check direct link and key dates
NEET UG 2025 Counselling: నీట్ యూజీ 2025 ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్ ఇదే
తొలి రౌండ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆల్ ఇండియా కోటా/డీమ్డ్/కేంద్ర విశ్వవిద్యాలయాల్లో జులై 30వ తేదీ వరకు నీట్ యూజీ కౌన్సెలింగ్ కొనసాగనుంది. నీట్ యూజీ 2025లో అర్హత సాధించిన విద్యార్థులు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) అధికారిక వెబ్‌సైట్ లో కౌన్సెలింగ్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు..
హైదరాబాద్, జులై 24: దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీస్ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ యూజీ 2025 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్‌లను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ప్రారంభించింది. నీట్ యూజీలో సాధించిన ర్యాంకుల ఆధారంగా ఆల్ ఇండియా, డీమ్డ్, సెంట్రల్, స్టేట్ కోటా సీట్లు ఈ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. తొలి రౌండ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆల్ ఇండియా కోటా/డీమ్డ్/కేంద్ర విశ్వవిద్యాలయాల్లో జులై 30వ తేదీ వరకు కొనసాగనుంది. నీట్ యూజీ 2025లో అర్హత సాధించిన విద్యార్థులు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) అధికారిక వెబ్‌సైట్ లో కౌన్సెలింగ్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు.
కాగా ఈ ఏడాది నీట్ యూజీ పరీక్షకు దేశ వ్యాప్తంగా మొత్తం 22.09 లక్షల మంది విద్యార్థులు హాజరు కాగా.. ఇందులో 12.36లక్షల మంది అర్హత సాధించారు. ఆల్ ఇండియా కౌన్సెలింగ్‌లో మొత్తం 1.3 లక్షల మెడికల్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో సీట్లు దక్కించుకోవాలంటే తప్పనిసరిగా MCC వెబ్‌సైట్‌లో నీట్ యూజీ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ 2025 చేసుకోవల్సి ఉంటుంది.