NEET-UG 2024 Revised Scorecard: నీట్‌ యూజీ 2024 రీ-ఎగ్జాం ఫలితాలు విడుదల.. వెబ్‌సైట్లో కొత్త ర్యాంకులు!

|

Jul 01, 2024 | 4:29 PM

నీట్‌ యూజీ -2024 పరీక్షలో గ్రేస్‌ మార్కులు కలిపిన 1563 మందికి జూన్ 23న నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ రీ-ఎగ్జాం నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా మొత్తం 7 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. కేవలం 813 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. దాదాపు 750 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. ఫలితాలతోపాటు పరీక్ష ఆన్సర్‌ కీని..

NEET-UG 2024 Revised Scorecard: నీట్‌ యూజీ 2024 రీ-ఎగ్జాం ఫలితాలు విడుదల.. వెబ్‌సైట్లో కొత్త ర్యాంకులు!
NEET-UG 2024 retest results
Follow us on

న్యూఢిల్లీ, జులై 1: నీట్‌ యూజీ -2024 పరీక్షలో గ్రేస్‌ మార్కులు కలిపిన 1563 మందికి జూన్ 23న నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ రీ-ఎగ్జాం నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా మొత్తం 7 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. కేవలం 813 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. దాదాపు 750 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. ఫలితాలతోపాటు పరీక్ష ఆన్సర్‌ కీని కూడా వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది. ఈ క్రమంలో నీట్ యూజీ అభ్యర్థులందరి ర్యాంకులను ఎన్‌టీఏ సవరించింది. ఈ మేరకు కొత్త ర్యాంకు కార్డులను వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచినట్లు ఎన్టీయే ప్రకటించింది.

నీట్ యూజీ 2024 రివైజ్డ్ స్కోర్ కార్డుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నీట్ యూజీ 2024 ఫైనల్ ఆన్సర్‌ ‘కీ’ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

కాగా నీట్ యూజీ 2024 పరీక్షను ఈ ఏడాది మే 5న దాదాపు 24 లక్షల మంది విద్యార్ధులకు ఎన్టీయే నిర్వహించింది. పరీక్ష రోజున మేఘాలయకు చెందిన కొందరు విద్యార్ధులకు తప్పుడు ప్రశ్నాపత్రం అందించడంతో గంట ఆలస్యంగా అధికారులు సరైన క్వశ్చన్‌ పేపర్‌ అందించారు. మొత్తం మూడు గంటల సమయంలో వీరందరికీ గంట సమయం వృధా అయినందున కోల్పోయిన గంట సమయానికి గానూ పరిహారంగా ఎన్టీయే గ్రేస్‌ మార్కులు ఇచ్చింది. ఇలా దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 4500 పరీక్ష కేంద్రాల్లో.. దాదాపు 6 కేంద్రాల్లో తప్పుడు ప్రశ్నాపత్రాలు విద్యార్ధులకు అందజేశారు. ఈ ఆరు కేంద్రాలకు ఎన్టీయే గ్రేస్‌ మార్కులు ప్రకటించింది. తీర ఫలితాలు వెలువడిన తర్వాత ఒక్కసారిగా ర్యాంకుల్లో తేడాలు వచ్చాయి. ఏకంగా 67 మందికి టాప్‌ ర్యాంకు రావడం పలు అనుమానాలకు తావిచ్చింది.

ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో గ్రేస్‌మార్కులు ఇచ్చిన 1563 మంది విద్యార్ధులకు మళ్లీ పరీక్ష నిర్వహించారు. దీంతో దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. తాజాగా గ్రేస్‌ మార్కులు తొలగించి, ఆ 1563 మందికీ మళ్లీ పరీక్ష నిర్వహించారు. మరోవైపు పరీక్ష ముందు రోజు పరీక్ష పేపర్‌ లీకేజీ జరిగినట్లు రుజువైంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురిని సీబీఐ అరెస్ట్‌ చేసి దర్యాప్తు చేస్తోంది. తాజాగా ఎన్టీయే విడుదల చేసిన సవరించిన ర్యాంకులతో అభ్యర్ధులు సంతృప్తి చెందుతారా? లేదంటే పరీక్ష రద్దు చేసి, మళ్లీ 24 లక్షల మందికి నీట్ యూజీ పరీక్ష నిర్వహించాలని కోరుకుంటారా? అనేది వేచి చూడాలి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.