NEET UG 2023: నీట్‌ యూజీ-2023 ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారా? మరికొన్ని గంటల్లో ముగుస్తోన్న గడువు..

|

Apr 05, 2023 | 1:39 PM

దేశవ్యాప్తంగా 2023-24 విద్యాసంవత్సరానికి గానూ మెడికల్‌ కాలేజీల్లో వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న నీట్‌ యూజీ-2023 ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మరో రెండు రోజుల్లో ముగియనుంది. మార్చి 6న రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభంకాగా..

NEET UG 2023: నీట్‌ యూజీ-2023 ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారా? మరికొన్ని గంటల్లో ముగుస్తోన్న గడువు..
NEET UG 2023
Follow us on

దేశవ్యాప్తంగా 2023-24 విద్యాసంవత్సరానికి గానూ మెడికల్‌ కాలేజీల్లో వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న నీట్‌ యూజీ-2023 ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మరో రెండు రోజుల్లో ముగియనుంది. మార్చి 6న రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభంకాగా ఏప్రిల్‌ 6తో దరఖాస్తు విధానం ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు అధికారిక వెబ్‌సైట్‌లో గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవల్సిందిగా ఎన్టీఏ సూచిస్తోంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/ బయోటెక్నాలజీతో సైన్స్‌లో ఇంటర్మీడియట్/ ప్రీ-డిగ్రీ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్ధుల వయసు తప్పనిసరిగా 17 ఏళ్లు నిండి ఉండాలి. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు రూ.1700, జనరల్‌ ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ-ఎన్‌సీఎల్‌ అభ్యర్థులకు రూ.1600, ఎస్సీ, ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ థర్డ్‌ జండర్‌ అభ్యర్థులకు రూ.100 చొప్పున రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇతర దేశాలకు చెందినవారైతే రూ.9500లు దరఖాస్తు రుసుము చెల్లించాలి.

మే 7న మధ్యాహ్నం 2గంటల నుంచి 5.20 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్టు ఇప్పటికే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అధికారిక నోటిఫికేషన్‌లో వెల్లడించింది. నీట్‌ యూజీ-2023 ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది ఇంగ్లిష్‌, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను ఆఫ్‌లైన్‌ (పెన్ను, పేపర్‌ విధానంలో) విధానంలో నిర్వహించనున్నారు. 3 గంటల 20 నిమిషాల వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది.

నీట్‌- యూజీ 2023 నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.