NEET PG Exams: కరోనా ఎఫెక్ట్… నీట్ 2021 పరీక్షలు మరో నాలుగు నెలలు వాయిదా..!

|

May 03, 2021 | 4:01 PM

NEET PG Exams:దేశంలో కరోనా సెకండ్ వేవ్ లో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతూ ఆందోళన రేకెత్తిస్తున్న్నాయి. ఈ నేపథ్యంలో నీట్ పరీక్షల నిర్వహణపై...

NEET PG Exams: కరోనా ఎఫెక్ట్... నీట్ 2021 పరీక్షలు మరో నాలుగు నెలలు వాయిదా..!
Follow us on

NEET PG Exams:దేశంలో కరోనా సెకండ్ వేవ్ లో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతూ ఆందోళన రేకెత్తిస్తున్న్నాయి. ఈ నేపథ్యంలో నీట్ పరీక్షల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.నీట్ పరీక్షలను మరో నాలుగు నెలలపాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.

దేశ వ్యాప్తంగా నీట్ పరీక్షలు ఏప్రిల్‌ 18న ఈ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే యువ వైద్య విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వాయిదా వేస్తున్నామని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్దన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆ పరీక్షలను మరో నాలుగు నెలల పాటు వాయిదా వేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మెడికల్ కాలేజీల్లో ఆడ్మిషన్ల కోసం నీట్ పరీక్షలను నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఆయా కాలేజీల్లో అభ్యర్థులకు సీట్లను కేటాయిస్తారు.

కొవిడ్‌ చికిత్సలో సిబ్బంది కొరత రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. 100 రోజులు కొవిడ్‌ విధుల్లో ఉన్న పీజీ విద్యార్థులకు ప్రభుత్వ వైద్య నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది.

Also Read: మీ తులసి చెట్టు మారే స్థితిని బట్టి ఇంట్లో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసుకోండి..