NCRTC Recruitment: నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి వ్యవహారాల మంత్రిత్వ శాఖకి చెందిన ఈ సంస్థలో కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* నోటిఫికేషన్‌లో భాగంగా ఆపరేషన్స్, మెయింటెన్స్ స్టాఫ్‌లో మొత్తం 226 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* ఇందులో భాగంగా మెయింటెనెన్స్ అసోసియేట్ (62), ప్రోగ్రామింగ్ అసోసియేట్ (04), టెక్నీషియన్ (93), స్టేషన్ కంట్రోలర్ / ట్రెయిన్ ఆపరేటర్ / ట్రాఫిక్ కంట్రోలర్ (67) ఖాళీలు ఉన్నాయి.
* మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్, మెకానిక్, వెల్డర్ విభాగాలున్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను అనుసరించి సంబంధిత ట్రేడులు / సబ్జెక్టుల్లో ఐటీఐ (ఎన్‌సీవీటీ / ఎస్‌సీవీటీ), మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా / బీఎస్సీ ఉత్తీర్ణత పొంది ఉండాలి.
* అభ్యర్థుల వయసు 25 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు, ఇతరులు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది.
* ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ 15-09-2021న ప్రారంభం కాగా, చివరి తేదీ 30-09-2021గా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
BHEL Recruitment: బీహెచ్‌ఈఎల్‌లో ఇంజనీర్, సూపర్ వైజర్ పోస్టులు.. దరఖాస్తులకు రేపే చివరి తేదీ..
Amazon Jobs: అమెజాన్‌లో వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లోనే పరీక్ష.. పూర్తి వివరాలు..!