NCERT RIE Mysore Teaching Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన న్యూదిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT)కి చెందిన మైసూర్‌లోని రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (RIE).. ఒప్పంద ప్రాతిపదికన ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ తదితర పోస్టుల (Professor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్(ఫిజికల్ కెమిస్ట్రీ), అసిస్టెంట్ ప్రొఫెసర్(ఫిజిక్స్/హిస్టరీ), మెడికల్ ఆఫీసర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (సైన్స్), కన్సల్టెంట్, టెక్నీషియన్ గ్రేడ్-I, ల్యాబొరేటరీ అసిస్టెంట్(సైకాలజీ), జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో, కోర్స్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.17,000ల నుంచి రూ.1,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టునుబట్టి పదో తరగతి/ఇంటర్మీడియట్/డిప్లొమా/బీఎస్సీబీఈడీ/ఎంబీబీఎస్/ఎంఎస్సీ/ఎంఏ/ఎంఈడీ/నెట్/స్లెట్/ఎంఫిల్/పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరవ్వాలి.
అడ్రస్: ప్రిన్సిపల్ ఛాంబర్, ఆర్‌ఐఈ, మైసూరు.
ఇంటర్వ్యూ తేదీ: 2022. జులై 21, 22వ తేదీల్లో నిర్వహిస్తారు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.