
హైదరాబాద్, డిసెంబర్ 31: ఎన్‌బీఈఎంఎస్ పరీక్షల వార్షిక క్యాలెండర్ 2026ను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) విడుదల చేసింది. 2026 సంవత్సరంలో జనవరి నుంచి జూన్ మధ్య నిర్వహించే వివిధ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్‌ను ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది. ఇందులో గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (GPAT), ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (FMGE), డిప్లొమేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ (DNB) వార్షిక పరీక్షలతోపాటు వివిధ డిప్లొమా, ఫెలోషిప్ పరీక్షల తేదీలను కూడా ప్రకటించింది.
ఎన్‌బీఈఎంఎస్ 2026 పరీక్షల షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (AP SBTET) మార్చి నుంచి ఏప్రిల్ 2025 వరకు నిర్వహించిన డిప్లొమా, ఫార్మసీ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్ sbtet.ap.gov.inలో తమ రోల్ నంబర్ నమోదు చేసి ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
AP SBTET 2025 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.