NBCC Recruitment: ఎన్‌బీసీసీ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖకి చెందిన ఈ నవరత్న సంస్థలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 70 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలు..
* మొత్తం 70 ఖాళీలకు గాను డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ (ఎలక్ట్రికల్)- 10, మేనేజ్‌మెంట్ ట్రెయినీ – 5, ప్రాజెక్ట్ మేనేజర్ (సివిల్)-01, సీనియర్ స్టెనోగ్రాఫర్ – 01, ఆఫీస్ అసిస్టెంట్ (స్టెనోగ్రాఫర్) – 03 పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత విభాగాల్లో డిగ్రీని పూర్తి చేసి ఉండాలి.
* అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 25 నుంచి 47 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 50,000 నుంచి రూ. 1,60,000 వరకు చెల్లిస్తారు. మేనేజ్‌మెంట్ ట్రైయినీకి నెలకు రూ. 40,000 నుంచి రూ. 1,40,000, ప్రాజెక్ట్ మేనేజర్‌కు నెలకు రూ. 60,000 నుంచి రూ. 1,80,000, ఆఫీస్ అసిస్టెంట్‌లకు రూ. 18,430 చెల్లిస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ 12-09-2012న ప్రారంభమవుతుంది.
* దరఖాస్తుల స్వీకరణకు 08-1-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Sirivennela Seetharama Sastry: ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్, భీమ్లానాయక్ పాటల విడుదల వాయిదా..