NIT Silchar Recruitment 2021: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫకేషన్ జారీ చేశారు. అసోంలోని సిల్చార్‌లో ఉన్న క్యాంపస్‌లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా వివిధ భాగాల్లో మొత్తం 54 ఖాళీలను భర్తీ చేస్తారు.
* డిప్యూటీ రిజిస్ట్రార్ (01), అసిస్టెంట్ రిజిస్ట్రార్ (01), లైబ్రేరియన్ (01), మెడికల్ ఆఫీసర్ (01), హిందీ ఆఫీసర్ (01), సూపరింటెండెంట్ (07), జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ (01), టెక్నికల్ అసిస్టెంట్/ ఎస్ఏఎస్ అసిస్టెంట్/ జూనియర్ ఇంజినీర్ (37), సీనియర్ అసిస్టెంట్ (04) పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. పోస్టుని అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
* అభ్యర్థులను రాత పరీక్ష/ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు.. ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
* అభ్యర్థులు తమ వివరాలను nfapt_21@nits.ac.in మెయిల్‌కు పంపించాల్సి ఉంటుంది.
* దరఖాస్తుకు చివరి తేదీగా 02.07.2021 నిర్ణయించారు.
* పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
Secunderabad Army School Jobs: సికింద్రాబాద్ ఆర్మీ స్కూల్‌లో టీచర్ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..