NIO Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..

|

Dec 26, 2021 | 4:49 PM

NIO Recruitment 2021: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీలో పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేసింది. భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖకు చెందిన ఈ సంస్థలో పోస్టులను భర్తీ చేయనున్నారు. గోవాలో ఉన్న..

NIO Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..
Follow us on

NIO Recruitment 2021: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీలో పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేసింది. భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖకు చెందిన ఈ సంస్థలో పోస్టులను భర్తీ చేయనున్నారు. గోవాలో ఉన్న ఈ సంస్థలో కాంట్రాక్ట్ విధానంలో పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 11 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ప్రాజెక్ట్ సైంటిస్ట్‌, ప్రాజెక్ట్ అసోసియేట్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, ఎమ్మెస్సీ, బీఈ/బీటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణత పొంది ఉండాలి.

* అభ్యర్థుల వయసు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 20,000 నుంచి రూ. 56,000 వరకు చెల్లిస్తారు.

* అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణ 02-01-2021తో ముగియనుంది.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Jabardasth Varsha: యెల్లో డ్రెస్ లో కేక పుట్టిస్తున్న జబర్దస్త్ వర్ష

Samantha’s Yashoda: శరవేగంగా సమంత ‘యశోద’ షూటింగ్.. సినిమా గ్రాండియ‌ర్‌గా ఉంటుందన్న నిర్మాత..

హాఫ్ సారీ లో అదరకొడుతున్న యాంకరమ్మ