NITIE Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్‌లో నాన్‌ టీచింగ్ పోస్టులు.. అర్హులెవరంటే..

|

Jan 06, 2022 | 9:01 AM

NITIE Recruitment: నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్ (నీతీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ముంబయిలోని క్యాంపస్‌లో నాన్‌ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు...

NITIE Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్‌లో నాన్‌ టీచింగ్ పోస్టులు.. అర్హులెవరంటే..
Nitie Jobs
Follow us on

NITIE Recruitment: నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్ (నీతీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ముంబయిలోని క్యాంపస్‌లో నాన్‌ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను తీసుకోనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 20 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో మేనేజర్‌ సిస్టమ్స్, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్, మేనేజర్‌ అకడమిక్‌ సిస్టమ్స్, లైబ్రరీ ఆఫీసర్, అకౌంట్స్‌ ఆఫీసర్, ఆడిట్‌ ఆఫీసర్, అకౌంటెంట్, ఇంటర్నల్‌ ఆడిటర్‌ కమ్‌ అడ్వైజర్, ప్రోగ్రామర్, నెట్‌వర్క్‌ ఇంజినీర్‌ పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా డిగ్రీ, ఇంజినీరింగ్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంబీఏ, ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

* అభ్యర్థుల వయసు అనుసరించి 40 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను మొదట రాత పరీక్ష/ స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 18-01-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Passwords: వెబ్‌ బ్రౌజర్లలో పాస్‌వర్డ్‌లు సేవ్‌ చేసుకుంటున్నారా.? అయితే ఒకటికి రెండుసార్లు ఆలోచించండి..

IND vs SA: రహానెను తప్పించాల్సిందే.. కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాల్సిందే.. గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

PM Modi: ప్రధాని మోదీకి సెక్యూరిటీ, ప్రొటోకాల్‌ ఏ విధంగా ఉంటుంది..? పర్యటనకు సంబంధించి రాష్ట్రాలు చేయాల్సిన పనేంటి..