భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢల్లీలోని నేషనల్ హౌసింగ్ బ్యాంక్.. 36 జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, రీజినల్ మేనేజర్, మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రాజెక్ట్ ఫైనాన్స్, లీగల్ రికవరీ, కంపెనీ సెక్రటరీ, క్రెడిట్, ఎంఐఎస్, ఎకనమిస్ట్, ఐటీ, ప్రొటొకాల్ ఆఫీసర్ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్/ఇంజినీరింగ్‌డిగ్రీ/సీఏ/ఎంసీఏ/ఎంబీఏ/పీజీ డిగ్రీ/ఎంఫిల్/పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు పోస్టును బట్టి 23 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 6, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్ధులకు రూ.850, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులకు రూ.175లు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.48,170ల నుంచి రూ.1,29,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.