భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ హౌసింగ్ బ్యాంక్.. ఒప్పంద ప్రాతిపదికన 28 చీఫ్ ఎకనామిస్ట్, ప్రొటోకాల్ ఆఫీసర్లు, జనరల్ మేనేజర్, రీజినల్ మేనేజర్, సూపర్‌వైజర్ ఆఫీసర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/ సీఏ/ సీఎంఏ/ మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు పోస్టును బట్టి 21 నుంచి 63 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్న వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 18, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్ధులకు రూ.850, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులకు రూ.175లు దరఖాస్తు రుసుముగా చెల్లించవల్సి ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష డిసెంబర్ 2022/ఫిబ్రవరి 2023లో నిర్వహిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.60,056ల నుంచి రూ.5 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.