NHM Recruitment: నేషనల్‌ హెల్త్‌ మిషన్‌, ఆంధప్రదేశ్‌లో ఉద్యోగాలు.. 858 ఖాళీలు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.

|

Sep 07, 2021 | 2:36 PM

NHM Recruitment: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌కార్యాలయం.. నేషనల్‌హెల్త్‌మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) కింద రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల..

NHM Recruitment: నేషనల్‌ హెల్త్‌ మిషన్‌, ఆంధప్రదేశ్‌లో ఉద్యోగాలు.. 858 ఖాళీలు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.
Follow us on

NHM Recruitment: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌కార్యాలయం.. నేషనల్‌హెల్త్‌మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) కింద రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల డీఎంహెచ్‌ఓల ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఏకంగా 858 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.

భర్తీచేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 858 ఖాళీలకు గాను స్పెషలిస్ట్‌లు–53, మెడికల్‌ ఆఫీసర్లు–308, స్టాఫ్‌ నర్సులు–324, ల్యాబ్‌టెక్నీషియన్లు–14, పారామెడికల్‌స్టాఫ్‌–90, కన్సల్టెంట్‌–13, సపోర్ట్‌స్టాఫ్‌–56 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తుకునే వారు పోస్టులను అనుసరించి పదో తరగతి, జీఎన్‌ఎం/బీఎస్సీ(నర్సింగ్‌), డీఎంఎల్‌/టీఎంఎల్‌టీ/బీఎస్సీ(ఎంఎల్‌టీ), సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌డిగ్రీ, ఎంఎస్‌డబ్ల్యూ/ ఎంఏ(సోషల్‌వర్క్‌), ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. అంతేకాకుండా సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులు దరఖాస్తును సంబంధిత వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో అందించాలి.
* ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ.12,000 నుంచి రూ.1,10,000 వరకు జీతంగా చెల్లిస్తారు.
* అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణ 15-09-2021తో ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Recording Dance:ఆలయ ప్రారంభోత్సవంలో రికార్డింగ్ డాన్యులు.. పోలీసులున్నా పట్టించుకోలేదని విమర్శలు

Bank alert! ఇలా చేయకుంటే మీ ఎస్‌బీఐతో సహా ఇతర బ్యాంక్ సేవలు నిలిచిపోయే అవకాశం..! ఎందుకో తెలుసా?

Saffron Cultivation: ప్రయోగం సక్సెస్.. విరగబూసిన కశ్మీర్‌ గులాబ్.. ఇప్పుడు ఉత్తరాఖండ్‌లో..