NDA Recruitment 2023: పదో తరగతి అర్హతతో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 251 ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

|

Jan 11, 2023 | 1:51 PM

నేషనల్ డిఫెన్స్ అకాడమీ.. 251 పెయింటర్‌, కుక్‌, ఫైర్‌మ్యాన్‌, ఎంటీఎస్‌, ఎల్‌డీసీ, బ్లాక్‌స్మిత్‌, డ్రాఫ్ట్‌మెన్‌, సివిలియన్‌ మోటర్‌ డ్రైవర్, సైకిల్‌ రిపేయర్‌ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌..

NDA Recruitment 2023: పదో తరగతి అర్హతతో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 251 ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
NDA Pune Recruitment 2023
Follow us on

పుణెలోని ఖడక్వస్లకు చెందిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ.. 251 పెయింటర్‌, కుక్‌, ఫైర్‌మ్యాన్‌, ఎంటీఎస్‌, ఎల్‌డీసీ, బ్లాక్‌స్మిత్‌, డ్రాఫ్ట్‌మెన్‌, సివిలియన్‌ మోటర్‌ డ్రైవర్, సైకిల్‌ రిపేయర్‌ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి/ఇంటర్మీడియట్‌, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో నోటిఫికేషన్‌ విడుదలైన 21 రోజుల్లోపు (జనవరి 21, 2023) దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ట్రేడ్‌టెస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌ చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.