NCPOR Recruitment 2021: నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషియన్ రీసెర్చ్ (ఎన్‌సీపీఓఆర్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో పనిచేసే ఈ సంస్థ మొత్తం 34 పోస్టులు భర్తీ చేయనుంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* మొత్తం 34 ఖాళీలకు గాను.. వెహికల్ మెకానిక్ (3), వెహికల్ ఎలక్ట్రిషన్ (3), ఆపరేటర్ ఎక్స్‌కావేటింగ్ మెషిన్ (1), క్రేన్ ఆపరేటర్ (2), స్టేషన్ ఎలక్ట్రిషన్ (1), జనరేటర్ ఆపరేటర్ (2), వెల్డర్ (3), బాయిలర్ ఆపరేటర్ (1), కార్పెంటర్ (2), మల్టీటాస్కింగ్ స్టాఫ్ (1), మేల్ నర్స్ (3), ల్యాబ్ టెక్నీషియన్ (2), రేడియో ఆపరేటర్ (3), బుక్‌కీపింగ్ స్టాఫ్ (2), చెఫ్ (5) భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులను అనుసరించి విద్యార్హతలను నిర్ణయించారు.
* దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు.. అనంతరం ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు.
* ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం ఆన్‌లైన్ అప్లికేషన్‌ను ప్రింట్ తీసి దానికి అవసరమైన సర్టిఫికేట్లను ఈ-మెయిల్ చేయాల్సి ఉంటుంది.
* పూర్తి వివరాలను logistics@ncpor.res.in ఐడీకి మెయిల్ చేయాల్సి ఉంటుంది.
* దరఖాస్తులకు చివరితేదీగా 17-06-2021ని నిర్ణయించారు.
* పూర్తి వివరాలకు www.ncpor.res.in ఈ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Also Read: TS EAMCET 2021: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. టీఎస్ ఎంసెట్ దరఖాస్తు గడువు మళ్లీ పొడిగింపు..