భారత ప్రభుత్వ పరిశ్రమలు, గనుల మంత్రిత్వ శాఖకు చెందిన భువనేశ్వర్‌లోని నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్.. 39 అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ సెరామిక్/మైనింగ్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ, సీఏ, సీఎమ్‌ఏ, ఇంజనీరింగ్ డిగ్రీ, జియాలజీ/ఎమ్మెస్సీ, పీజీ డిప్లొమా, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో పని అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు డిసెంబర్ 10వ తేదీ నాటికి 35 నుంచి 45 యేళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్నవారు ఎవరైనా డిసెంబర్ 10, 2022వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని కింది అడ్రస్‌కు అక్టోబర్ 7, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.70,000ల నుంచి రూ.2,60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.