NAARM Recruitment: హైదరాబాద్‌లోని (Hyderabad) రాజేంద్రనగర్‌లో ఉన్న ఐసీఏఆర్-నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ మేనేజ్‌మెంట్ (నార్మ్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వానికి చెందిన ఈ సంస్థలో వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 12 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఎక్స్‌ఎస్‌ఎం డివిజన్ ,డీటీఎంఏ, ఆడిట్ అండ్ అకౌంట్స్ సెక్షన్, ఈఎస్‌ఎం విడిజన్, జీఐఎస్ యాక్టివిటీస్, ట్రైనింగ్ యాక్టివిటీస్ వంటి పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్/ మాస్టర్స్, బీకామ్/బీబీఏ/బీబీఎస్, పోస్టు గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
* అభ్యర్థుల వయసు 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఇంటర్వ్యూలను ఐసీఏఆర్-నార్మ్, రాజేంద్రనగర్, హైదరాబాద్ – 500030, తెలంగాణ అడ్రస్‌లో నిర్వహిస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 35,000 చెల్లిస్తారు.
* వాక్‌ఇన్ ఇంటర్వ్యూలను 18-04-2022, 20-04-2022, 22-04-2022 తేదీల్లో నిర్వహించనున్నారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: KS Ramarao: కర్నూలుని మూవీ హబ్‌గా తీర్చిదిద్దుదాం.. త్వరలో సినీ పెద్దలను కలుస్తా అంటున్న నిర్మాత
Viral Video: రోడ్డు మీద సర్కస్ స్టంట్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే!