Mumbai port recruitment: ముంబయి పోర్ట్‌లో అప్రెంటిస్ పోస్టులు.. నేరుగా మార్కుల ఆధారంగా ఎంపిక.
ముంబయు పోర్ట్ అథారిటీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 2022-23 ఏడాదికి గాను టెక్నీషియన్/గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ శిక్షణలో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇందులో భాగంగా పలు ఇంజనీరింగ్ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు..
ముంబయు పోర్ట్ అథారిటీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 2022-23 ఏడాదికి గాను టెక్నీషియన్/గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ శిక్షణలో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇందులో భాగంగా పలు ఇంజనీరింగ్ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ముంబయి పోర్ట్ వంటి ప్రతిష్టాత్మక పోర్టులో అప్రెంటిస్ శిక్షణ చేయడం అభ్యర్థులకు మంచి ఎక్స్‌పీరియన్స్‌గా నిలుస్తుంది. ఇంతకీ ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీ కోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 11 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* వీటిలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (మెకానికల్ ఇంజనీరింగ్) (2), గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) (3), టెక్నీషియన్ అప్రెంటిస్ (మెకానికల్ ఇంజనీరింగ్) (3), టెక్నీషియన్ అప్రెంటిస్ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) (3) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత ఇంజనీరింగ్ విభాగాలంఓ డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
* అభ్యర్థుల కనిష్ట వయసు 14 ఏళ్లు, వయసు పరిమితి అంటూ ఏమీ లేదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను డిప్లొమా లేదా డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా నేరుగా ఎంపిక చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉండదు.
* ఎంపికైన గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు శిక్షణతో పాటు నెలకు రూ. 9000, టెక్నీషియన్ అప్రెంటిస్‌కు రూ. 8000 జీతంగా అందిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 09-01-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..