ఇదికదా గుడ్‌న్యూస్ అంటే.. వచ్చే మార్చి నాటికి భారీగా ఉద్యోగ నియామకాలు! వీరికి ఫుల్‌ డిమాండ్

భారత్‌లో ఉద్యోగ నియామకాల సెంటిమెంట్ ప్రపంచ సగటు కంటే 28 శాతం పాయింట్లు ఎక్కువగా ఉన్నట్లు తాజా సర్వే వెల్లడించింది. ఇది వచ్చే మార్చి త్రైమాసికంలో భారత్‌ను ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంచింది. అంటే జాబ్ నియామకాల్లో బ్రెజిల్ తర్వాత భారత్‌ రెండో స్థానాన్ని కైవసం చేసుకోనుందన్నమాట. జనవరి-మార్చి 2025తో పోలిస్తే వచ్చే త్రైమాసికంలో నియామకాల్లో 12% పాయింట్లు పుంజుకున్నాయి..

ఇదికదా గుడ్‌న్యూస్ అంటే.. వచ్చే మార్చి నాటికి భారీగా ఉద్యోగ నియామకాలు! వీరికి ఫుల్‌ డిమాండ్
More Companies Plan Hiring In March Quarter

Updated on: Dec 09, 2025 | 4:50 PM

హైదరాబాద్, డిసెంబర్ 9: రాబోయే త్రైమాసికంలో పలు కంపెనీ యాజమన్యాలు దేశ వ్యాప్తంగా మరిన్ని ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నాయి. మ్యాన్‌పవర్‌గ్రూప్ సర్వే ఈ మేరకు వెల్లడించింది. బడా కంపెనీల్లో జాబ్‌ ఆపర్స్ పరిమితంగానే ఉన్నప్పటికీ వచ్చే 3 నెలల్లో 3,051 మంది యజమానులలో దాదాపు 63 శాతం మంది తాము భారీగా నియామకాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. మిగిలిన 11 శాతం మంది ఈ విషయంలో సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ మేరకు తాజా ఔట్‌లుక్ సర్వే తెలిపింది. లేబర్‌ మార్కెట్ ట్రెండ్‌ నికర ఉపాధి 52%గా ఉన్నట్లు తెలిపింది.

అయితే భారత్‌లో ఈ నియామకాల సెంటిమెంట్ ప్రపంచ సగటు కంటే 28 శాతం పాయింట్లు ఎక్కువగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. ఇది వచ్చే మార్చి త్రైమాసికంలో భారత్‌ను ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంచింది. అంటే జాబ్ నియామకాల్లో బ్రెజిల్ తర్వాత భారత్‌ రెండో స్థానాన్ని కైవసం చేసుకోనుంది. జనవరి-మార్చి 2025తో పోలిస్తే వచ్చే త్రైమాసికంలో నియామకాల్లో 12% పాయింట్లు బలంగా ఉంది. డిసెంబర్ త్రైమాసికం కంటే ఇది 11 శాతం పాయింట్లు ఎక్కువ. అయితే గతంలో కంటే ఎక్కువ మంది యజమానులు హ్యూమన్‌ ఫోర్స్ నియమించుకోవాలని భావిస్తున్నప్పటికీ.. నియామకాల పరిమాణం మాత్రం అంతంత మాత్రంగానే ఉండనుంది.

ఒక సాధారణ కంపెనీ మొత్తం శ్రామిక శక్తి వచ్చే త్రైమాసికంలో 65 మంది చొప్పున పెరుగుతుందని అంచనా. 2025 ఏప్రిల్-జూన్‌లో మ్యాన్‌పవర్ ఈ మెట్రిక్‌ను ట్రాక్ చేయడం ప్రారంభించినప్పటి నుంచి 60% తగ్గుదల కనిపిస్తుంది. అదే సమయంలో ఈ సంఖ్య 162 వద్దకు చేరింది. ఈ తగ్గుదలకు వెయ్యి నుంచి 4,999 మంది కార్మికులను నియమించే సంస్థలు ఎక్కువగా కారణమవుతున్నాయి. భారత్‌లో నియామకాల వృద్ధి ఆర్థిక, సామర్థ్య నిర్మాణంలో కొత్త దశకు సంకేతమని మ్యాన్‌పవర్‌గ్రూప్ ఇండియా, మిడిల్ ఈస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ గులాటి తెలిపారు. ముఖ్యంగా నియామకాల నియంత్రణ.. పెద్ద సంస్థలలో వ్యూహాత్మకమైన చర్యగా అభిప్రాయపడ్డారు. కంపెనీలు తమ శ్రామిక శక్తి నమూనాలను తిరిగి ఇంజనీరింగ్ చేస్తున్నాయి. అధిక-ప్రభావం చూపే రోల్స్‌కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా శాశ్వత, సౌకర్యవంతమైన ప్రొఫెనల్స్‌కి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఫైనాన్స్‌- ఇన్సురెన్స్‌లో 61%, ప్రొఫెషనల్, సైంటిఫిక్‌, టెక్నికల్‌ సర్వీసుల్లో 57% చొప్పున నియామకాలు చేపట్టే అవకాశం ఉంది. ఇక కన్‌స్ట్రక్షన్‌, రియల్ ఎస్టేట్‌లో 54%, తయారీ రంగంలో 53%, కంపెనీ విస్తరణలో 43%, సాంకేతిక పురోగతులు 38% చొప్పున ఉద్యోగుల సంఖ్య పెరగనున్నాయి. ఈ జాబితాలో ఆటోమేషన్ 42%తో శ్రామిక శక్తి తగ్గింపుల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ప్రొఫెషనల్, టెక్నికల్, సైంటిఫిక్ సేవలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. ఉత్తరాదిలో ఈ నియామకాలు 59%గా ఉన్నాయి. ముఖ్యంగా డిసెంబర్ త్రైమాసికం నుంచి 14 శాతం పుంజుకున్నాయి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.