కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ మిషన్ మోడల్ ప్రాజెక్ట్ కింద సౌత్ రీజియన్‌లోని మోడల్ కెరీర్ సెంటర్‌లలో.. ఒప్పంద ప్రాతిపదికన 40 యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎకనామిక్స్/సైకాలజీ/సోషియాలజీ/ఆపరేషన్స్ రిసెర్చ్/స్టాటిస్టిక్స్/సోషల్ వర్క్/మేనేజ్‌మెంట్/ఫైనాన్స్/కామర్స్/కంప్యూటర్ అప్లికేషన్స్ స్పెషలైజేషన్‌లో బీఏ, బీఈ, బీటెక్, బీఈడీ, ఎంబీఏ/పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 24 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో నోటిఫికేషన్ విడుదలైన 15 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ అక్టోబర్ 12న విడుదలైంది. పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.50,000ల చొప్పున జీతం చెల్లిస్తారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ(ఇంజినీరింగ్/ఆర్కిటెక్చర్, ఆయుర్వేదం, ఫార్మసీ/ఫార్మాస్యూటికల్ సైన్సెస్), పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఇతర వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.