IIT Hyderabad Jobs 2022: హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే నేరుగా..
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లోనున్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-1, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లోనున్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-1, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్, బయోటెక్నాలజీ, లిబరల్ ఆర్ట్స్, కెమికల్ ఇంజినీరింగ్, మెటీరియల్స్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, డిజైన్ తదితర విభాగాల్లో ఖాళీలగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
అలాగే కనీసం 3 ఏళ్ల పాటు ఇండస్ట్రియల్/రీసెర్చ్/టీచింగ్‌లో అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించకుండా ఉండాలి. వయోపరిమితి విషయంలో రిజర్వేషన్ వర్గాలకు సడలింపు వర్తిస్తుంది. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 4, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు/ఇంటర్వ్యూ/అనుభవం ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-1 పోస్టులకు రూ.1,01,500, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-2 పోస్టులకు రూ.98,200ల చొప్పున జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.