Ministry of Defence Recruitment 2021: ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు సువర్ణావకాశం. పదో తరగతి అర్హతతో కేంద్ర రక్షణ శాఖలో ఉద్యోగం సంపాదించవచ్చు. బెంగళూరులోని ఏఎస్‌సీ సెంటర్ సౌత్ కోసం దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 400 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో సివిల్ మోటార్ డ్రైవర్, క్లీనర్, కుక్, సివిలియన్ కేటరింగ్ ఇన్‌స్ట్రక్టర్, లేబర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లాంటి పోస్టులున్నాయి. వీటికి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు పోస్టు ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 17 దరఖాస్తులకు చివరి తేదీ. దరఖాస్తు ఫామ్ కూడా అధికారిక నోటిఫికేషన్‌లోనే ఉంటుంది. మొత్తం ఖాళీలు 400గా నిర్ణయించారు. అందులో సివిల్ మోటార్ డ్రైవర్ (పురుషులు మాత్రమే)- 115, క్లీనర్- 67, కుక్- 15, సివిలియన్ కేటరింగ్ ఇన్‌స్ట్రక్టర్- 3, లేబర్ (పురుషులు మాత్రమే)- 193, మల్టీ టాస్కింగ్ స్టాఫ్- 7 పోస్టులు ఉన్నాయి.
ఇతర సమాచారం..
1. విద్యార్హతలు: సివిల్ మోటార్ డ్రైవర్ పోస్టులకు టెన్త్ క్లాస్ పాస్ కావాలి. హెవీ, లైట్ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్‌లో రెండేళ్ల అనుభవం ఉండాలి. మోటార్ మెకానిజం తెలిసి ఉండాలి. పురుషులు మాత్రమే అప్లయ్ చేయాలి.
2. క్లీనర్: టెన్త్ పాస్ కావాలి.
3. కుక్: టెన్త్ పాస్ కావాలి. కుకింగ్‌లో అనుభవం ఉండాలి.
4. సివిలియన్ కేటరింగ్ ఇన్‌స్ట్రక్టర్: టెన్త్ పాస్ కావాలి. కేటరింగ్‌లో డిప్లొమా లేదా సర్టిఫికెట్ కోర్స్ పాస్ కావాలి. కేటరింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి.
5. లేబర్: టెన్త్ పాస్ కావాలి. పురుషులు మాత్రమే అప్లయ్ చేయాలి.
6. మల్టీ టాస్కింగ్ స్టాఫ్: టెన్త్ పాస్ కావాలి.
ఎంపిక విధానం: రాతపరీక్షతో పాటు స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వేతనం: సివిల్ మోటార్ డ్రైవర్, క్లీనర్, కుక్, సివిలియన్ కేటరింగ్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు రూ.19,900 + డీఏ, లేబర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు రూ.18,000 + డీఏ ఉంటుంది.
దరఖాస్తులు ప్రారంభం: ఆగస్ట్ 28, 2021
దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 17, 2021