TS Govt Jobs: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్‌ అవుతున్న వారికి తెలంగాణ సర్కారు బంపరాఫర్‌.. ఫ్రీ కోచింగ్‌తో పాటు..

|

May 03, 2022 | 9:53 AM

TS Govt Jobs: తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల (Job Notification) చేసిన విషయం తెలిసిందే. పోలీసు, గ్రూప్‌ 1 పోస్టులకు ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ కూడా...

TS Govt Jobs: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్‌ అవుతున్న వారికి తెలంగాణ సర్కారు బంపరాఫర్‌.. ఫ్రీ కోచింగ్‌తో పాటు..
Free Coaching In Telangana
Follow us on

TS Govt Jobs: తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల (Job Notification) చేసిన విషయం తెలిసిందే. పోలీసు, గ్రూప్‌ 1 పోస్టులకు (Group 1) ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ కూడా మొదలైంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులు కోచింగ్‌ సెంటర్ల బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులకు ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా కోచింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని ప్రతీ నియోజనవర్గానికి ఒకటి చొప్పున శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు.

సోమవారం మాసబ్‌ ట్యాంక్‌లోని తన ఆఫీసులో మన బస్తి-మన బడి కార్యక్రమం అమలుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 9న హైదరాబాద్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో మన బస్తి–మన బడి కార్యక్రమం ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ సమావేశంలో హోం మంత్రి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కలెక్టర్, విద్యాశాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్‌ అవుతున్న వారికి నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఉచిత కోచింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడంతో పాటు ప్రతీ అభ్యర్థికి నెలకు రూ. 5 వేలు అందిస్తామని తలసాని తెలిపారు. ఒక్కో బ్యాచ్‌కు 100 మంది చొప్పు మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తలకు క్లిక్ చేయండి..

Also Read: By-polls Schedule: మూడు అసెంబ్లీ సీట్ల ఉపఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. మే 31న పోలింగ్‌

Rashmika Mandanna : దూసుకుపోతున్న రష్మిక.. ఆ మూడు క్రేజీ కాంబోలో ఛాన్స్ కొట్టేసిన చిన్నది.

Health Tips: వేసవిలో ఐస్ క్రీమ్ తింటే ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందా..! అసలు సంగతి తెలిస్తే షాకవుతారు..