Meru International School: అధునాతన విద్యా ప్రమాణాలతో ప్రమాణాలతో, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది హైదరాబాద్‌కు చెందిన మేరు ఇంటర్నేషన్ స్కూల్. విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేలా, సరికొత్త కరిక్యూలంతో దూసుకుపోతున్న మేరు విద్యా సంస్థకి తాజాగా అరుదైన గుర్తింపు లభించింది. దేశంలోని పాఠశాలలకు ఎడ్యుకేషన్ వరల్డ్ అందించే ‘ఎమర్జింగ్ హై పొటెన్షియల్ స్కూల్’ ర్యాంకింగ్స్‌లో మేరు స్కూల్ ఉత్తమ ర్యాంకింగ్స్ సాధించింది.
2021-2022 ఏడాదికిగాను మేరు ఇంటర్నేషనల్ స్కూల్ దేశంలో నాలుగో స్థానంలో, తెలంగాణలో మొదటి స్థానంలో నిలవడం విశేషం. అంతర్జాతీయ విద్యా వేత్తలతో సీఫోర్స్ అనే సంస్థ దేశ వ్యాప్తంగా 3000కిపైగా స్కూల్స్‌పై నిర్వహించిన సర్వేలో మేరు స్కూల్ చోటు దక్కించుకుంది. పాఠశాలల్లో అందించే నాణ్యమైన విద్య, అధునాతన మౌలిక సదుపాయాలు, విద్యా బోధన విధానం ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటిస్తారు.
మేరు ఇంటర్నేషనల్ స్కూల్ ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకోవడంపై సంస్థ డైరెక్టర్ మేఘన రావు జూపల్లి మాట్లాడుతూ.. ‘మేరు స్కూలుకు ఇలాంటి అరుదైన గౌరవం దక్కడం గర్వంగా ఉంది. విలువలతో కూడిన విద్యను అందించే క్రమంలో మేము చేసిన కృషికి ఈ అవార్డు దక్కిన ఫలితంగా భావిస్తున్నాం. కరోనా లాంటి పాండమిక్ సమయంలో మాకు సహకరించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు మా ధన్యవాదాలు. మేము చేపట్టిన M-CLAP ప్రోగ్రామ్‌తో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెరగడంతో పాటు వారికి నచ్చిన వృత్తిని ఎంచుకునే స్వేచ్ఛను ఇస్తుంది’ అంటూ చెప్పుకొచ్చారు.
Also Read: Bhadrachalam News: భగ్గుమన్న భద్రాచలం.. నిరసనకారులు, పోలీసుల మధ్య తోపులాట
ఏళ్లుగా పెనవేసుకున్న కులవివక్ష.. బార్బర్ షాపుల్లోకి దళితులకు నో ఎంట్రీ.. కోర్టు ఆగ్రహం