Work from home: వారానికి ఒక్క రోజు ఆఫీసుకు వస్తే చాలు.. ఉద్యోగులకు బంపరాఫర్‌ ఇచ్చిన మీషో..

|

Dec 17, 2022 | 6:10 AM

కరోనా పరిస్థితుల నేపథ్యంలో దాదాపు అన్ని కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానాన్ని అవలంభిస్తున్న విషయం తెలిసిందే. అప్పటి వరకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని అవలంభించని కంపెనీలు సైతం కరోనా దెబ్బతో తీరు మార్చుకోవాల్సి వచ్చింది. అయితే కరోనా క్రమంగా తగ్గుముఖం..

Work from home: వారానికి ఒక్క రోజు ఆఫీసుకు వస్తే చాలు.. ఉద్యోగులకు బంపరాఫర్‌ ఇచ్చిన మీషో..
Meeshow Work From Home
Follow us on

కరోనా పరిస్థితుల నేపథ్యంలో దాదాపు అన్ని కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానాన్ని అవలంభిస్తున్న విషయం తెలిసిందే. అప్పటి వరకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని అవలంభించని కంపెనీలు సైతం కరోనా దెబ్బతో తీరు మార్చుకోవాల్సి వచ్చింది. అయితే కరోనా క్రమంగా తగ్గుముఖం పట్టడం, ప్రస్తుతం కరోనా కేసులు పూర్తిగా కనుమరుగుకావడంతో కొన్ని కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు రమ్మని పిలుపునిస్తున్నాయి. అయితే మరొకొన్ని సంస్థలు మాత్రం ఇప్పటికీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని అవలంభిస్తున్నాయి.

ఇదే సమయంలో హైబ్రిడ్ వర్క్‌ కల్చర్‌ అనే విధానంలో కూడా అందుబాటులోకి వచ్చింది. అంటే వారంలో సగం రోజులు ఇంటి నుంచి మిగతా సగం రోజులు ఆఫీసులో పనిచేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ప్రముఖ ఈకామర్స్‌ సంస్థ మీషో తమ ఉద్యోగుల కోసం బంపరాఫర్‌ను ప్రకటించింది. వారంలో కేవలం ఒక రోజు ఆఫీసుకు వచ్చే చాలని తెలిపింది. వారంలో మిగతా రోజులన్నీ ఇంటి నుంచే పని చేసుకునే వెసులుబాటును కల్పించింది. వచ్చే ఏడాది జూన్‌ నుంచి ఈ విధానం అమల్లో ఉంటుందని సంస్థ తెలిపింది.

అప్పటివరకు మీషో ఉద్యోగులు ఎక్కడినుంచైనా పనిచేసుకోవచ్చు. మెజారిటీ ఉద్యోగుల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ బ్లాగ్ పోస్ట్‌లో మీషో చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ ఆశిష్ కుమార్ సింగ్‌ వెల్లడించారు. ఫ్లెక్సీ-ఆఫీస్ అనేది వారానికి ఒకసారి ఆఫీసుకు, మిగతా రోజులు రిమోట్‌గా పనిచేస్తారని ఇది ఒక టీంగా ఉద్యోగులకు మధ్య సాన్నిహిత్యం పెరగడానికి తోడ్పడుతుందని ఆయన అన్నారు. ఇటీవలి సర్వేలో, మెజారిటీ ఉద్యోగులు తమ మధ్య వ్యక్తిగత కనెక్షన్‌ల అవసరం గురించి మాట్లాడారని అందుకే ఫ్లెక్సీ-ఆఫీస్ మోడల్‌ను అవలంబిస్తున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..