LSAT- India 2022 June Application Last Date: లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్ – ఇండియా (LSAT India) 2022 ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ రేపటి (జూన్ 8)తో ముగియనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న పలు లా స్కూల్స్‌లో అడ్మిషన్లు పొందగోరే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.discoverlaw.in/లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎల్‌శాట్ ఇండియా-2022 ప్రవేశ పరీక్ష జూన్ 22 నుంచి ఆన్‌లైన్ విధానంలో ఎంపిక చేసుకున్న స్లాట్ లో నిర్వహించబడుతుంది. అంటే విద్యార్ధులు అందుబాటులోనున్న స్లాట్‌లలో పరీక్ష సమయం, తేదీలను ఎంపిక చేసుకోవచ్చు. ఆయా తేదీల్లో ఇంటి వద్దనుంచే ఆన్‌లైన్ రిమోట్ విధానంలో పరీక్ష రాయవచ్చు. ఈ పరీక్షలో ప్రతిభకనబరచిన అభ్యర్ధులకు పలు ఇన్‌స్టిట్యూట్‌లలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ లా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. LSAT ఇండియా స్కోర్ కార్డుకు 5 సంవత్సరాల వరకు వ్యాలిడిటీ ఉంటుంది.
షమ్నాద్ బషీర్ యాక్సెస్ టు జస్టిస్ ఎస్సే స్కాలర్‌షిప్ (LSAC Shamnad Basheer Scholarship 2022)కు సంబంధించి ఎస్సే సమర్పణకు చివరి తేదీ జూన్ 10 (రాత్రి 11 గంటల 59 నిముషాల వరకు). The impact of Social Media – Is it promoting inclusivity or widening the gap? అనే టాపిక్‌పై వ్యాసం రాయవల్సి ఉంటుంది. ఈ పోటీలో ప్రతిభ కనబరచిన మొదటి 50 ర్యాంకర్లకు లా యూజీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్ తీసుకున్న తర్వాత స్కాలర్‌షిప్ అందించడం జరుగుతుంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.