TS Transco Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. JLM పోస్టులకు రూట్ క్లియర్.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

TS Transco posts: తెలంగాణ ట్రాన్స్‌కోలోని జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీకి అడ్డంకులు తొలిగాయి. తెలంగాణ ఉమ్మడి జిల్లాల పరిధిలో 1100 జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీకి 2017లో నోటిఫికేషన్‌ వచ్చింది. రాతపరీక్ష,..

TS Transco Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. JLM పోస్టులకు రూట్ క్లియర్.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Ts Transco Posts

Updated on: Jul 29, 2021 | 11:12 AM

తెలంగాణ ట్రాన్స్‌కోలోని జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీకి అడ్డంకులు తొలిగాయి. తెలంగాణ ఉమ్మడి జిల్లాల పరిధిలో 1100 జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీకి 2017లో నోటిఫికేషన్‌ వచ్చింది. రాతపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయాలని… ఇన్‌సర్వీసులో ఉన్న వారికి ఏడాదికి రెండు మార్కుల వంతున ఇవ్వాలని, గరిష్ఠంగా పదేళ్లను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. అయితే ట్రాన్స్‌కో నిర్ణయంపై ఇన్ సర్వీస్‌మెన్లు వెయిటేజీపై కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఇన్‌సర్వీసులో ఉన్న కార్మికులకు వెయిటేజీ అనంతరం కొలువులు భర్తీ చేయనున్నారు.

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…

విద్యార్హతలు: 10వ తరగతి, ఎలక్ట్రికల్ ట్రేడ్/ వైర్‌మెన్ ట్రేడ్‌లో ITI లేదా ఇంటర్మీడియట్‌లో ఎలక్ట్రికల్ వొకేషనల్ కోర్స్ చదివిన వాళ్లు జూనియర్ లైన్ మెన్ పోస్టులకు అర్హులు.

నోటిఫికేషన్‌: అయితే 2017 డిసెంబరు 28న 1100 JLM పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడిన విషయం తెలిసిందే.
వయోపరిమితి: జూనియర్ లైన్‌మెన్ పోస్టులకు 18 నుంచి 35 ఏళ్లు ఉన్న వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. జూనియర్ పర్సనల్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు 18 నుంచి 34 ఏళ్లు ఉన్న వాళ్లు దరఖాస్తు చేసుకున్నారు.

దరఖాస్తు ఇలా చేయడం: పూర్తి వివరాలకు వెబ్‌సైట్ ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు https://tstransco.cgg.gov.in వెబ్‌సైట్‌లో చూడాలని అధికారులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: Marine Srinivas: మిస్టరిగా మైరెన్‌ ఉద్యోగి శ్రీనివాస్‌ మిస్సింగ్.. ఆ యువతిపైనే అనుమానాలు..

Jhunjhunwala New Plan: బిగ్‌ బుల్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా కొత్త ప్లాన్.. సామాన్యుల కోసం ప్రత్యక్ష వ్యాపారంలోకి..