LIC HFL Recruitment 2021: ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా మొత్తం 6 ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు. ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, భోపాల్, ముంబయి బ్రాంచ్‌లలో పనిచేయాల్సి ఉంటుంది.
* అభ్యర్థులు సోషల్ వర్క్/రూరల్ మేనెజ్‌మెంట్ విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిస్టెన్స్ లెర్నింగ్, పార్ట్‌టైమ్, కరస్పాండెంట్ కోర్సులు చేసిన వారి ఈ పోస్టులకు అనర్హులు.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు జనవరి 1, 2021 నాటికి 23 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి.
* సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం తప్పనిసరి.
* ఆన్‌లైన్ అప్లికేషన్ల ప్రక్రియ మే 24న ప్రారంభమవుతుండగా.. జూన్ 7న ముగియనుంది.
* దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఆనలైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ. 6 నుంచి రూ. 9 లక్షల వరకు జీతంగా అందిస్తారు.
* పూర్తి వివరాలకు www.lichousing.com వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Also Read: Sharwanand: నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపిన హీరో శర్వానంద్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..
Adipurush Movie: ‘ఆదిపురుష్’లో సిద్ధార్థ్ కీలక పాత్ర ? అసలు విషయం బయటపెట్టిన బిగ్‌బాస్ విన్నర్..
Lockdown Extension: జూన్ 7వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడిగింపు.. సరుకులు ఇంటి వద్దకు చేర్చేందుకు అనుమతి