Govt Jobs 2025: కేంద్రీయ, నవోదయ స్కూళ్లలో 14,967 ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్‌

KVS NVS Recruitment 2025 last date: కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS), నవోదయ విద్యాలయ సమితి (NVS).. దేశవ్యాప్తంగా ఉన్న స్కూళ్లలో భారీగతా టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాల భర్తీకి ఇటీవల రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2025 విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద..

Govt Jobs 2025: కేంద్రీయ, నవోదయ స్కూళ్లలో 14,967 ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్‌
KVS NVS teaching and non-teaching Recruitment

Updated on: Dec 09, 2025 | 5:56 PM

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS), నవోదయ విద్యాలయ సమితి (NVS).. దేశవ్యాప్తంగా ఉన్న స్కూళ్లలో భారీగతా టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాల భర్తీకి ఇటీవల రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2025 విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 14,967 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. పదో తరగతి అర్హతత కలిగిన వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తు గడువు మరో 2 రోజుల్లో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు డిసెంబర్‌ 11, 2025వ తేదీ తుది గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నియామక ప్రక్రియను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నిర్వహిస్తుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, నైపుణ్య పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. నిజానికి, గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు డిసెంబర్‌ 4, 2025వ తేదీతో దరఖాస్తు గడువు ముగిసింది. అయితే ఈ గడువును డిసెంబర్‌ 11 వరకు కేంద్రం ప్రకటించింది.

దేశం వ్యాప్తంగా మొత్తం 1,288 కేంద్రీయ విద్యాలయాలు, మొత్తం 653 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్ధులు దేశంలో ఎక్కడైనా, గ్రామీణ, పట్టణ, రెసిడెన్షియల్ క్యాంపస్‌లలో పని చేయాల్సి ఉంటుంది. టైర్‌1, టైర్‌2, టైపింగ్/స్టెనోగ్రఫీ/ట్రాన్స్‌లేషన్‌ నైపుణ్య పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. PRT, TGT పోస్టులకు CTET అర్హత తప్పనిసరి.

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు ఇవే..

  • అసిస్టెంట్ కమిషనర్ పోస్టుల సంఖ్య: 17
  • ప్రిన్సిపల్ పోస్టుల సంఖ్య: 227 (KVS 134 + NVS 93)
  • వైస్ ప్రిన్సిపల్ పోస్టుల సంఖ్య: 58 (KVS)
  • పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGTs) పోస్టుల సంఖ్య: 2,996
  • ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGTs) పోస్టుల సంఖ్య: 6,215
  • ప్రైమరీ టీచర్ – PRT పోస్టుల సంఖ్య: 2,684
  • PRT (సంగీతం) పోస్టుల సంఖ్య: 187
  • స్పెషల్ ఎడ్యుకేటర్ (పీఆర్‌టీ) పోస్టుల సంఖ్య: 494
  • లైబ్రేరియన్ పోస్టుల సంఖ్య: 147 (KVS 147)
  • KVS బోధనేతర పోస్టుల సంఖ్య: 1,155
  • NVS బోధనేతర పోస్టుల సంఖ్య: 787

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.