KVS Admission 2021: కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశానికి లాటరీ పద్దతిలో డ్రా.. నేడు ఫస్ట్‌ క్లాస్‌ జాబితా విడుదల

KVS Admission 2021: కేంద్రియ విద్యాలయ సంఘటన్ పాఠశాలల్లో 2021 జూన్‌ 23 ఒకటో తరగతి ప్రవేశానికి జాబితాను విడుల చేయనుంది. అయితే లాటరీ పద్దతిలో డ్రా తీయనుంది...

KVS Admission 2021: కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశానికి లాటరీ పద్దతిలో డ్రా.. నేడు ఫస్ట్‌ క్లాస్‌ జాబితా విడుదల
Kvs Admission 2021

Updated on: Jun 23, 2021 | 2:25 PM

KVS Admission 2021: కేంద్రియ విద్యాలయ సంఘటన్ పాఠశాలల్లో 2021 జూన్‌ 23 ఒకటో తరగతి ప్రవేశానికి జాబితాను విడుల చేయనుంది. అయితే లాటరీ పద్దతిలో డ్రా తీయనుంది. ఈ జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్థుల జాబితాను పొందుపర్చనుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఫస్ట్‌క్లాస్‌ జాబితా కోసం kvsonlineadmission.kvs.gov.in లో చూడవచ్చు. ఈ జాబితాలను కేంద్రీయ విశ్వవిద్యాయాలు తమ వెబ్‌సైట్లో తెలియజేస్తాయి. అలాగే సీట్లు ఖాళీగా ఉంటే రెండవ, మూడవ జాబితాలు వరుసగా జూన్‌ 30, జూలై 5 2021నాటికి పూర్తి జాబితాను విడుదల చేస్తాయి. రిజర్వ్‌ చేయని సీట్ల కోసం ప్రాధాన్యత క్రమం ప్రకారంగా అభ్యర్థుల తాత్కాలిక ఎంపిక జాబితా జూలై 2 నుంచి జూలై 6వ తేదీ వరకు ఉంటుంది. చూడవచ్చు. కాగా, కరోనా మహమ్మారి కారణంగా జాబితాను విడుదల చేయడంలో ఆలస్యం జరిగింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులలో డ్రా పద్దతి ద్వారా జాబితాను విడుదల చేస్తుంది కేంద్రీయ విశ్వవిద్యాలయం.

తాజా షెడ్యూల్‌ ప్రకారం విద్యార్థుల తల్లిదండ్రులు ఈ రోజు నుంచి జాబితాను వెబ్‌సైట్‌లో తనిఖీ చేసుకోవచ్చు. అయితే విద్యార్థుల జాబితాను ఒక నిర్ధష్టమైన సయయాన్ని కేటాయించలేదు. కొన్ని ప్రాంతాల్లో ఉదయం 11 గంటలకు లాటరీ విధానం నిర్వహించగా, మరి కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు విడుదల చేయనుంది. అయితే విద్యార్థులు మొదటి క్లాస్‌లో ప్రవేశానికి మున్సిపాలిటీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ నుంచి పుట్టిన ధృవీకరణ పత్రం, గ్రామపంచాయతీ, మిలటరీ ఆస్పత్రి మరియు రక్షణ సిబ్బంది సేవా రికార్డుల నుంచి పుట్టిన తేదీ పత్రాలను రుజువుగా పరిగణిస్తారు. క్లాస్‌ 2 ప్రవేశానికి సంబంధించిన ప్రవేశ ప్రక్రియ జూన్‌ 25 నుంచి జూన్‌ 30 వరకు నిర్వహించబడుతుంది.

 ప్రవేశ ఫలితాలను ఎలా తనిఖీ చేయాలి

– ముందు సంబంధిత కేవీ వెబ్‌సైట్‌ను సందర్శించాలి
– తర్వాత హోమ్‌ పేజీలో లేదా ప్రవేశ విభాగం కింద ప్రచురించబడిన జాబితాపై క్లిక్‌ చేయాలి.
– తర్వాత పేజీలో మీ పిల్ల పేర్లను తనిఖీ చేయడం ద్వారా ఈ జాబితాను చూసుకోవచ్చు.

High Court on Schools: స్కూల్స్‌ రీఓపెన్‌పై హైకోర్టు కీలక సూచన.. రెండు, మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తామన్న విద్యాశాఖ

NIN Recruitment 2021: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌లో ప‌లు ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..