Railway Jobs 2022: నెలకు రూ.1,03,228ల జీతంతో కొంకణ్ రైల్వేలో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే..
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన నవీ ముంబాయిలోని కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (KRCL).. డిప్యూటీ చీఫ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి..
Konkan Railway Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన నవీ ముంబాయిలోని కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (KRCL).. డిప్యూటీ చీఫ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 9
పోస్టుల వివరాలు: డిప్యూటీ చీఫ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ తదితర పోస్టులు
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ (సివిల్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.58,819ల నుంచి రూ.1,03,228ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరవ్వొచ్చు.
అడ్రస్: ఎగ్జిక్యూటివ్ క్లబ్, కొంకణ్ రైల్ విహార్, కేఆర్సీఎల్, సెక్టార్ 40, నవీ ముంబాయి 400706.
ఇంటర్వ్యూ తేదీ: 2022, మార్చి 25, 28, 29 తేదీల్లో జరుగుతుంది.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: