తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.. 2024-25 విద్యా సంవత్సరానికి బీపీటీ, బీఎస్సీ అనుబంధ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు గానూ అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ప్రవేశాల ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వర్సిటీ అనుబంధ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. అక్టోబరు 28వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. నవంబరు 6వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు కొనసాగుతాయి. ధ్రువ పత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. ఈ మేరకు వర్సిటీ తన ప్రకటనలో వివరించింది.
బీఎస్సీ ఎంఎల్‌టీ కోర్సుకు మూడేళ్లు, బీపీటీకి నాలుగేళ్లు, మిగిలిన కోర్సులకు నాలుగేళ్ల చొప్పున వ్యవధి ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ లేదా ఇంటర్ ఒకేషనల్ బ్రిడ్జ్ కోర్సు లేదా ఫిజికల్ సైన్సెస్/ బయోలాజికల్ సైన్సెస్ సబ్జెక్టులతో సార్వత్రిక విద్యలో ఇంటర్‌లో ఉత్తీర్ణులై వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్థుల వయసు డిసెంబర్ 31, 2024 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు నవంబర్ 6, 2024వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. దరఖాస్తు రుసుము కింద ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.2500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.2000 చెల్లించవల్సి ఉంటుంది. ఎలాంటి ప్రవేశ పరీక్ష నిర్వహించకుండా ఇంటర్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.