KAPL Recruitment: బెంగళూరు కేఏపీఎల్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 60వేలకుపైగా జీతం పొందే అవకాశం..

|

Nov 15, 2021 | 10:20 AM

KAPL Recruitment 2021: కర్ణాటక యాంటీబయాటిక్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ (కేఏపీఎల్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. బెంగళూరులో ఉన్న ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థలో...

KAPL Recruitment: బెంగళూరు కేఏపీఎల్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 60వేలకుపైగా జీతం పొందే అవకాశం..
Kapl Jobs
Follow us on

KAPL Recruitment 2021: కర్ణాటక యాంటీబయాటిక్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ (కేఏపీఎల్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. బెంగళూరులో ఉన్న ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా ప్రొఫెషనల్ సర్వీస్‌ రిప్రజంటేటివ్‌ (29), ఏరియా మేనేజర్లు (09), రీజియనల్‌ సేల్స్‌ మేనేజర్ (02) ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* ప్రొఫెషనల్ సర్వీస్‌ రిప్రజంటేటివ్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు ఫార్మసీ/ సైన్స్‌/ కామర్స్‌/ ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు.

* ఏరియా మేనేజర్‌ పోస్టులకు సైన్స్‌/ ఫార్మసీలో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత పొంది ఉండాలి. వీటితో పాటు ఫ్రంట్‌ లైణ్‌ మేనేజర్‌గా కనీసం రెండేళ్లు అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.

* రీజియనల్‌ సేల్స్‌ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఫార్మసీ/సైన్స్‌/ కామర్స్‌లో గ్రాడ్యుయేషన్‌తో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 50 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* పూర్తి వివరాలను కేఏపీఎల్‌, ఎన్‌టీటీఎఫ్‌ మెయిన్‌ రోడ్‌, పీన్యా ఇండస్ట్రియల్‌ ఏరియా, బెంగళూరు చిరునామాకు పంపించాలి.

* ప్రొఫెషనల్ సర్వీస్‌ రిప్రజంటేటివ్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 26,000, ఏరియా మేనేజర్‌ పోస్టులకు రూ. 40,000, రీజియనల్‌ సేల్స్‌ మేనేజర్‌ పోస్టులకు రూ. 65,000 జీతంగా చెల్లిస్తారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Anushka Shetty: బరువు తగ్గే పనిలో భాగమతి.. ఇందుకోసం ఏయే చిట్కాలు పాటిస్తుందంటే..

Sindhu Pushkaram: పుష్కర శోభను సంతరించుకోనున్న సింధు నది.. ఈ నెల 20 నుంచి సింధు నది పుష్కరాలు ప్రారంభం..

RRR: ఇది మాములు మాస్‌ కాదు.. ఊర మాస్‌. ట్రాఫిక్‌లో ఆర్‌.ఆర్‌.ఆర్‌ పాటకు స్టెప్పులు.. వైరల్‌ వీడియో..