AP GGH Jobs 2026: పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు

GGH CCC Kadapa Jobs 2026: మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలోని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) తాజాగా ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కడప జిల్లాలోని గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌ (జీజీహెచ్‌)లోని క్యాన్సర్‌ కేర్‌ సెంటర్‌ (సీసీసీ)లో ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీకి..

AP GGH Jobs 2026: పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
Kadapa GGH CCC Recruitment

Updated on: Jan 05, 2026 | 5:06 PM

ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలోని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) తాజాగా ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కడప జిల్లాలోని గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌ (జీజీహెచ్‌)లోని క్యాన్సర్‌ కేర్‌ సెంటర్‌ (సీసీసీ)లో ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 34 జనరల్‌ డ్యూటీ అటెండెంట్‌, మేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లి (ఎంఎన్‌ఓ), ఫీమేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లి (ఎఫ్‌ఎన్‌ఓ), స్టెచ్చర్‌ బాయ్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన వారు జనవరి 12, 2026వ తేదీ వరకు ఆఫ్‌లైన్‌ విధానంలో చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోవచ్చు..

పోస్టుల వివరాలు ఇవే..

  • జనరల్‌ డ్యూటీ అటెండెంట్‌ పోస్టుల సంఖ్య: 30
  • మేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లి (ఎంఎన్‌ఓ) పోస్టుల సంఖ్య: 1
  • ఫీమేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లి (ఎఫ్‌ఎన్‌ఓ) పోస్టుల సంఖ్య: 2
  • స్టెచ్చర్‌ బాయ్‌ పోస్టుల సంఖ్య: 1

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతి లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. మేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లి పోస్టుకు ఫస్ట్‌ ఎయిడ్‌ సర్టిఫికేట్‌ తప్పనిసరిగా ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించకూడదు. ఈ అర్హతలు ఉన్నవారు ఆఫ్‌లైన్‌ విధానంలో ఈ కింది అడ్రస్‌కు జనవరి 12, 2026వ తేదీలోపు దరఖాస్తులను సమర్పించాలి. తాత్కాలిక మెరిట్‌ జాబితాను ఫిబ్రవరి 21, 2026వ తేదీన విడుదల చేస్తారు. తుది ఎంపిక జాబితాను మార్చి 17, 2026న విడుదల చేస్తారు. ఎలాంటి రాత పరీక్షలేకుండానే విద్యార్హతల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.15,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

అడ్రస్..

ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ప్రిన్సిపల్‌, గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజ్‌, పుట్లంపల్లి, కడప కార్యాలయంలో అందించాలి.

ఇవి కూడా చదవండి

కడప జిల్లా హెల్త్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగ నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్న విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.