JEE Advanced 2021: దేశ వ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలలు, టెక్నికల్ కోర్సులలో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్ 2021 బ్రోచర్ విడుదలైంది. ఈ పరీక్షల తేదీలు ఇంకా ప్రకటిచనప్పటికీ జేఈఈ మెయిన్స్ రాసి, అడ్వాన్స్‌డ్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఎలాంటి ఊరట నిచ్చారు.. మహిళల కోటాపై ఏం చేయనున్నారు.. బోర్డు ఎగ్జామ్స్‌లో ఎంత శాతం వస్తే జేఈఈ పరీక్షలు రాయడానికి అర్హులు అనే అంశాలపై తాజా సమాచారాన్ని ఈ బ్రోచర్‌లో పొందుపరిచారు.
ఐఐటీ ఖరగ్‌పూర్ విడుదల చేసిన ఈ బ్రోచర్‌లో.. ఈ ఏడాది అడ్వాన్స్‌డ్ పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది ప్రకటించలేదు. అయితే గత ఏడాది 2020 మెయిన్స్ పాసైన అభ్యర్థులకు ఈ ఏడాది అడ్వాన్స్‌డ్ (2021) పరీక్షలు రాయడానికి అవకాశం ఇచ్చారు. సాధారణంగా ఇలా మెయిన్ పరీక్షలను క్యారీఫార్వర్డ్ చేయడానికి జేఈఈ పరీక్షక్షలలో చోటు లేదు. అయితే కోవిడ్ కారణంగా 2020లో మెయిన్స్ పాసైన కొంతమంది, అడ్వాన్స్‌డ్ పరీక్షలు రాయలేకపోయారు. దీంతీ తమకు మరో అవకాశం కల్పించాలని వీరు డిమాండ్ చేశారు. ఫలితంగా వీరికి 2021లో మెయిన్స్ రాయకుండానే అడ్వాన్స్‌డ్ పరీక్షలు రాయడానికి అనుమతిస్తున్నట్లు బ్రోచర్‌లో పేర్కొన్నారు.
అయితే దీనివల్ల అడ్వాన్స్‌డ్ పరీక్షలు రాసే అభ్యర్థులల సంఖ్య, కళాశాలలో సీట్లకు ఎక్కువగా పోటీ ఏర్పడి వీరిని 2020 బ్యాచ్‌గానే గుర్తిస్తారు. ఆ ఏడాదికి సంబంధించిన సీట్లను వీరికి కేటాయిస్తారు. అంటే దీని వల్ల ఎటువంటి అదనపు పోటీ ఉండదన్నట్లు. ఐఐటీల్లో విద్యార్థినులకు గత ఏడాది 20శాతం కోటా కేటాయించగా, ఈ ఏడాది ఆయా ఐఐటీలు సొంతంగా విద్యార్థినుల కోటాను నిర్ణయించనున్నాయి.