Job Mela: ఆదివారం తెలంగాణలో భారీ జాబ్‌ మేళా.. పాల్గొననున్న 15కిపైగా కంపెనీలు..

|

Mar 31, 2022 | 4:37 PM

Job Mela: కరోనా (Corona) తదనంతర పరిస్థితుల తర్వాత మళ్లీ ఉద్యోగాల కల్పన స్పీడందుకుంది. మొన్నటి వరకు మందకొడిగా సాగిన ఉద్యోగాల నియామకల ప్రక్రియ ప్రస్తుతం పెరిగింది. కంపెనీలు సైతం పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ప్రభుత్వ...

Job Mela: ఆదివారం తెలంగాణలో భారీ జాబ్‌ మేళా.. పాల్గొననున్న 15కిపైగా కంపెనీలు..
Follow us on

Job Mela: కరోనా (Corona) తదనంతర పరిస్థితుల తర్వాత మళ్లీ ఉద్యోగాల కల్పన స్పీడందుకుంది. మొన్నటి వరకు మందకొడిగా సాగిన ఉద్యోగాల నియామకల ప్రక్రియ ప్రస్తుతం పెరిగింది. కంపెనీలు సైతం పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ప్రభుత్వ సంస్థలైన ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌, తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌లు జాబ్‌ మేళాలు నిర్వహిస్తున్నాయి. అంతేకాకుండా పలు ప్రైవేట సంస్థలు సైతం జాబ్‌ మేళాలను నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా జహీరాబాద్ లోక్‌ సభ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జి్‌, టీపీసీసీ ఐటీ సెల్ చైర్మన్ మదన్‌ మోహన్ రావు జాబ్‌ మేళాను నిర్వహిస్తున్నారు. ఆదివారం (ఏప్రిల్ 3) రోజున ఈ జాబ్‌మేళాను కామారెడ్డిలో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా పలు ప్రైవేటు కంపెనీలు పాల్గొననున్నాయి. పెద్ద ఎత్తున ఖాళీలను భర్తీ చేయనున్నాయి. జాబ్‌మేళాలో ఏయే కంపెనీలు పాల్గొంటున్నాయి. ఎలా రిజిస్టర్‌ చేసుకోవాలి లాంటి వివరాలు మీకోసం..

* జాబ్‌మేళాలో పీవీఆర్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎస్‌బీఐ కార్డ్‌, మెడ్‌ ప్లస్‌, జయభేరి ఆటోమోటివ్‌, అపోలో ఫార్మసీ, హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌తో పాటు మరికొన్ని కంపెనీలు జాబ్‌మేళాలో పాల్గొననున్నాయి.

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకొని నేరుగా ఇంటర్వ్యూ జరిగే ప్రదేశానికి హాజరుకావాల్సి ఉంటుంది.

* అభ్యర్థులు ముందుగా ఈ లింక్‌ను క్లిక్‌ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.

* లింక్‌ ఓపెన్‌ చేసిన తర్వాత వాట్సాప్ నంబర్, మొబైల్ నంబర్, విద్యార్హతల వివరాలు నమోదు చేయడంతో పాటు రెజ్యూమ్‌ సాఫ్ట్‌కాపీని అప్లోడ్ చేయాలి.

* అనంతరం సబ్‌మిట్ బటన్‌పై క్లిక్‌ చేస్తే సరిపోతుంది.

* ఏప్రిల్‌ 3న కామారెడ్డిలోని పార్శి రాములు ఫంక్షన్‌ హాల్‌లో జరిగే ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.

Also Read: KMC Recruitment: మెడికల్‌ కాలేజీలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకు పైగా జీతం పొందే అవకాశం.. ఎవరు అర్హులంటే..

Marriage Function: మొదలు కానున్న పెళ్లిళ్ల సీజన్.. 40 లక్షల వివాహలు..రూ. 5లక్షల కోట్ల వ్యాపారం జరగనున్నట్లు అంచనా

వేసవిలో ఫంక్షన్స్ లో ఇలాంటి నగలు ధరిస్తే మరింత అందగా ఉంటారు..