JNVS 6th class Admission test Results 2023: దేశవ్యాప్తంగా ఉన్న 649 జవహర్ నవోదయ విద్యాలయాల్లో (జేఎన్‌వీ) 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు బుధవారం (జూన్ 21) విడుదలయ్యాయి. ఈ మేరకు ఫలితాలు విడుదలైనట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ వెల్లడించింది. ప్రవేశ పరీక్షల ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. కాగా ఏప్రిల్ 29న జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్-2023 (ప్రవేశ పరీక్ష) జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి.
తెలుగు రాష్ట్రాల్లో.. ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 జేఎన్‌వీలు ఉన్నాయి. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఆయా జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఉచిత విద్యతోపాటు వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తారు. బాలబాలికలకు వేర్వేరు సదుపాయాలు ఉంటాయి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.