JEE Main 2025 Admit Card: మరోవారంలో జేఈఈ మెయిన్‌ తొలి విడత అడ్మిట్‌కార్డులు.. సీటీ ఇంటిమేషన్‌ స్లిప్ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

|

Jan 13, 2025 | 2:31 PM

దేశ వ్యాప్తంగా ఉన్న 23 ఎన్‌ఐటీల్లో బీఈ/బీటెక్‌ సీట్ల భర్తీకి యేటా నిర్వహించే జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు ఈ ఏడాది కూడా సమీపిస్తున్నాయి. మరో వారంలో అడ్మిట్ కార్డులు విడుదల కానున్నాయి. ఈ నెల 22 నుంచి ఆన్ లైన్ విధానంలో ఈ పరీక్షలు జరగనున్నయి. పరీక్షకు మూడు రోజుల ముందు నుంచి అడ్మిట్ కార్డులు అందుబాటులోకి తీసుకురానున్నారు..

JEE Main 2025 Admit Card: మరోవారంలో జేఈఈ మెయిన్‌ తొలి విడత అడ్మిట్‌కార్డులు.. సీటీ ఇంటిమేషన్‌ స్లిప్ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
JEE Main 2025 Exam
Follow us on

హైదరాబాద్‌, జనవరి 13: దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్‌, బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్‌ 2025 మొదటి విడత రాత పరీక్షకు సంబంధించిన సీటి ఇంటిమేషన్‌ స్లిప్పులు తాజాగా విడుదలయ్యాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి సీటి ఇంటిమేషన్‌ స్లిప్పులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇక త్వరలోనే అడ్మిట్‌ కార్డులు కూడా విడుదల కానున్నాయి. కాగా జేఈఈ మెయిన్‌-2025 తొలి విడత పరీక్షలు జనవరి 22, 23, 24, 28, 28, 31 తేదీల్లో జరగనున్న సంగతి తెలిసిందే. జనవరి 22న మొదలయ్యే బీఈ/బీటెక్‌ పేపర్‌1 పరీక్షలు రోజుకు రెండు షిఫ్టుల్లో జరగనున్నాయి. మొదటి షిఫ్ట్‌ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, సెకండ్‌ షిఫ్ట్‌ 3 గంటల నుంచి సాయంత్రం 6 వరకు జరుగుతాయి. జనవరి 31 తేదీన మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు బీఆర్క్‌/ బీ ప్లానింగ్‌ సెకండ్‌ షిఫ్ట్‌లో పేపర్‌ 2ఏ, 2బీ పరీక్షలు జరగనున్నాయి.

యేటా జేఈఈ మెయిన్‌ పరీక్షలు రెండు విడతల్లో జరుగుతాయన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి తొలి విడదల పరీక్షకు దేశ వ్యాప్తంగా దాదాపు 13. 8 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ఎన్‌ఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి పేపర్‌ 1 పరీక్ష నిర్వహిస్తారు. ఇక బీఆర్క్, బీప్లానింగ్‌ సీట్ల భర్తీకి పేపర్‌ 2 పరీక్షను నిర్వహిస్తారు. హాల్‌టికెట్లను పరీక్ష తేదీకి సరిగ్గా రోజుల ముందు మాత్రమే విడుదల చేస్తారు. ఇక జేఈఈ మెయిన్‌ రెండో సెషన్‌ పరీక్షలు ఏప్రిల్‌ 1 నుంచి 8 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్టీఏ షెడ్యూల్‌ ప్రకటించింది. జేఈఈ మెయిన్‌ 2025 మొదటి విడత రాత పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు జనవరి 19 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

జేఈఈ మెయిన్‌ రెండు విడతల్లో కనీస స్కోర్‌ సాధించిన తొలి 2.50 లక్షల మంది మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 పరీక్ష రాసేందుకు అర్హత సాధిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 పరీక్ష మొత్తం 2 పేపర్లకు జరుగుతుంది. మే 18న రెండు సెషన్లలో పరీక్ష జరుగుతుంది. పేపర్ 1 పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్ 2 పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుంది. ఇందుకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు మే 11వ తేదీన విడుదల అవుతాయి. జూన్‌ 2న ఫలితాలు విడుదల చేస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న 23 ఎన్‌ఐటీల్లో సీట్లు భర్తీ చేస్తారు. 2025-26 విద్యా సంవత్సరానికి 17,695 బీటెక్, బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌(బీఎస్‌) సీట్లు భర్తీ చేశారు. మరికొన్ని సీట్లు పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. బీఆర్క్‌ కోర్సుల్లో చేరాలనుకునే వారు ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు (ఏఏటీ) రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష జూన్‌ 5 నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.