JEE main may 2021: దేశంలో కరోనావైరస్ మహమ్మారి తీవ్రంగా కోరలు చాస్తోంది. నిత్యం మూడు లక్షలకు పైగా కోవిడ్ కేసులు, మూడు వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో ఇప్పటికే పలు పరీక్షలను వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కరోనా తీవ్రత దృష్ట్యా మరో జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షను కూడా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. జేఈఈ మెయిన్స్ 2021 పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం ప్రకటించింది. మే 24, 25, 26, 27, 28 తేదీల్లో నిర్వహించాల్సిన మెయిన్స్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఎన్టీఏ తెలిపింది. కాగా.. ఇంతకుముందు ఏప్రిల్ సెషన్ కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే. కరోనా విజృంభణ నేపథ్యంలో ఏప్రిల్ 27, 28, 30 తేదీల్లో జరగాల్సిన జేఈఈ మెయిన్స్ పరీక్షలను కూడా వాయిదా వేశారు.
Looking at the present situation of COVID-19 and keeping students safety in mind, JEE (Main) – May 2021 session has been postponed .
Students are advised to keep visiting the official website of NTA for further updates.@DG_NTA pic.twitter.com/utMUGrmJNi— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) May 4, 2021
అంతకుముందు కేంద్ర ప్రభుత్వం కరోనా కేసులు పెరుగుతుండటంతో సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. వారందరినీ పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు వెల్లడించింది. దీంతోపాటు 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా నీట్, యూజీసీ నెట్ పరీక్షలను కూడా వాయిదా వేస్తూ వెల్లడించింది. ఒకవేళ పరీక్షలను నిర్వహించాలనుకుంటే.. 15 రోజులు ముందుగా ప్రకటన విడుదల చేస్తామని తెలిపింది.
Also Read: