JEE Main 2022: గుడ్‌న్యూస్‌! జేఈఈ మెయిన్‌ 2022 దరఖాస్తులకు మరో అవకాశం ఇచ్చిన NTA.. చివరితేదీ ఇదే!

జేఈఈ మెయిన్‌ 2022 మొదటి సెషన్‌ రాసేందుకు దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులకు నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మరో అవకాశం ఇచ్చింది. విద్యార్థుల కోరిక మేరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ..

JEE Main 2022: గుడ్‌న్యూస్‌! జేఈఈ మెయిన్‌ 2022 దరఖాస్తులకు మరో అవకాశం ఇచ్చిన NTA.. చివరితేదీ ఇదే!
NEET UG 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 09, 2022 | 4:29 PM

JEE Main 2022 online registration last date extended: జేఈఈ మెయిన్‌ 2022 మొదటి సెషన్‌ రాసేందుకు దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులకు నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మరో అవకాశం ఇచ్చింది. విద్యార్థుల కోరిక మేరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ (JEE Main 2022 Online Application) ఈ నెల (ఏప్రిల్‌) 18 నుంచి 25వ తేదీ రాత్రి 9 గంటల వరకు దరఖాస్తు చేయడానికి గడువు ఇచ్చినట్లు ఎన్టీఏ వెల్లడించింది. కాగా ఇప్పటికే జేఈఈ మెయిన్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చివరి తేదీని పలు మార్లు పొడిగించిన ఎన్టీఏ మరోసారి దరఖాస్తులకు చివరితేదీని పొడిగించింది. సెకండ్‌ సెషన్‌ (చివరి) దరఖాస్తుకు సంబంధించిన షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తామని ఈ సందర్భంగా పేర్కొంది.

వాస్తవానికి..ఎన్టీఏ విడుదల చేసిన జేఈఈ మెయిన్‌ 2022 నోటిఫికేషన్‌ ప్రకారం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మార్చి 31 సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది. ఐతే విద్యార్ధుల అభ్యర్ధన మేరకు దరఖాస్తు గడువును ఏప్రిల్‌ 5 వరకు పొడిగించింది. మళ్లీ ఇప్పుడు మరోమారు పొడిగిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో ఏప్రిల్‌ 25వ తేదీ రాత్రి 9 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్ధులెవరైనా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఎన్టీఏ ఈ సందర్భంగా సూచించింది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ jeemain.nta.nic.inలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇక ఈ పరీక్షకు సంబంధించిన తేదీల విషయంలో దేశ వ్యాప్తంగా పలు చర్చలు కూడా జరిగాయి. ఎట్టకేలకు జేఈఈ మెయిన్‌ కొత్త తేదీలు వెలువడినప్పటికీ పలు రాష్ట్రాల్లోని బోర్డు పరీక్షలు రాసే విద్యార్థులకు ఆయా తేదీలు అడ్డుగా ఉండటంతో ఇంటర్‌, టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల షెడ్యుళ్లను కూడా మార్చి కొత్త టైం టేబుళ్లను విడుదల చేశాయి. జేఈఈ మెయిన్ – 2022 ఏప్రిల్‌ సెషన్‌కు సంబంధించిన కొత్త తేదీలు (JEE Main 2022 revised exam dates).. జూన్ 20 నుంచి 29 వరకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు ఎన్టీఏ స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్ – 2022 పరీక్షకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఎటువంటి వయోపరిమితి లేదు. అలాగే 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి 12వ తరగతి లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులై విద్యార్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ మొదటి సెషన్‌కు సంబంధించిన హాల్‌ టికెట్లు ఈ నెలలో (ఏప్రిల్‌) విడుదలకానున్నాయి.

ఇక ఈ పరీక్ష అస్సామీ, బెంగాలీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషలతో పాటు హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ భాషల్లో నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఐతే దరఖాస్తును పూరించే సమయంలో తప్పనిసరిగా ప్రశ్నపత్రం భాషను కూడా ఎంచుకోవల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బందులు ఎదుర్కో్కతప్పదు. ఇక ఈ ఏడాది నిర్వహించనున్న జేఈఈ మెయిన్‌ 2022 పరీక్షలో నెగెటివ్ మార్కింగ్‌ కూడా ఉంటుంది.

Also Read:

TSPSC Group 1 Notification 2022: 503 పోస్టుల భర్తీ.. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ 2022కు రంగం సిద్ధం!

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..