గత పదేళ్లలో ప్రఖ్యాత IITల్లో భారీగా బీటెక్‌ సీట్ల కోత.. కారణం ఇదే!

గడచిన దశాబ్ధ కాలంలో పలు ఐఐటీల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లకు చెందిన వందలాది BTech సీట్లు రద్దు అయ్యాయి. కొన్ని IITలలో కెమికల్, టెక్స్‌టైల్, మైనింగ్, మెటలర్జీ, మెటీరియల్స్ వంటి బ్రాంచ్‌లు తమ సీట్లలో దాదాపు సగం సీట్లను కోల్పోయాయి. JEE అడ్వాన్స్‌డ్ సీట్ మ్యాట్రిక్స్ డేటా ఈ విషయాలను వెల్లడిస్తుంది..

గత పదేళ్లలో ప్రఖ్యాత IITల్లో భారీగా బీటెక్‌ సీట్ల కోత.. కారణం ఇదే!
JEE Advanced report on IITs seats

Updated on: Dec 24, 2025 | 5:45 PM

గడచిన దశాబ్ధ కాలంలో పలు ఐఐటీల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లకు చెందిన వందలాది BTech సీట్లు రద్దు అయ్యాయి. కొన్ని IITలలో కెమికల్, టెక్స్‌టైల్, మైనింగ్, మెటలర్జీ, మెటీరియల్స్ వంటి బ్రాంచ్‌లు తమ సీట్లలో దాదాపు సగం సీట్లను కోల్పోయాయి. JEE అడ్వాన్స్‌డ్ సీట్ మ్యాట్రిక్స్ డేటా ఈ విషయాలను వెల్లడిస్తుంది. ఉదాహరణకు IIT ఢిల్లీలో 2015 కంటే 2025లో BTech టెక్స్‌టైల్ ఇంజనీరింగ్‌లో 48.07% తక్కువ సీట్లు ఉన్నాయి. అదేవిధంగా IIT రూర్కీలో ఇదే కాలంలో మెటలర్జికల్, మెటీరియల్స్ ఇంజనీరింగ్‌లో సగానికి పైగా సీట్లు అంటే 54.5% సాట్లు తగ్గాయి. ఇది అందించే బయోటెక్నాలజీ, పాలిమర్ సైన్స్, ఇంజనీరింగ్‌లో దాని అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లను కూడా నిలిపివేసింది. కొత్త బ్రాంచ్‌ల రాకతో ఈ తగ్గుదల సంభవించినట్లు తెలుస్తుంది. ఐఐటీలలో మొత్తం సీట్ల సంఖ్య 80% పైగా పెరిగాయి. 2015లో 10,006 నుంచి 2025లో 18,160కి పెరిగడమే ఈ మార్పుకు ప్రధాన కారణం.

ఈ మార్పులను ట్రాక్ చేయడానికి ఆయా సీట్ల డేటాను Careers360.. JIC నివేదిక ద్వారా ప్రతి ఏడాది JEE అడ్వాన్స్‌డ్‌ను నిర్వహించడానికి బాధ్యత వహించే IIT సంకలనం చేస్తుంది. సీట్లు, బ్రాంచ్‌లు, ప్రశ్నాపత్రాలు, విద్యార్థుల పనితీరుపై వివరాలను ఇది అందిస్తుంది. అయితే 2016 -2017 సంవత్సరాలకు బ్రాంచ్ వారీగా సీట్ మ్యాట్రిక్స్ అందుబాటులో లేదు. 2015 నుంచి 2025 వరకు జరిగిన IIT ప్రవేశ పరీక్ష, JEE అడ్వాన్స్‌డ్ ప్రతి రౌండ్ తర్వాత JIC నివేదికలలో వెల్లడించింది. Careers360.. బొంబాయి, ఢిల్లీ, మద్రాస్, ఖరగ్‌పూర్, కాన్పూర్, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (BHU) – వారణాసి, రూర్కీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ (ISM) ధన్‌బాద్.. ఈ 8 ఇన్‌స్టిట్యూట్‌ల సీట్లను పరిశీలించింది. ఓపెన్, అన్‌రిజర్వ్డ్ సీట్ల సంఖ్యను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. ఎందుకంటే 2019 జనవరిలో 10% EWS కోటా ప్రవేశపెట్టడంతో IITలలో మొత్తం సీట్ల సంఖ్య పెరిగింది. మొత్తం సీట్లలో వారి వాటా 10 శాతం పాయింట్లు తగ్గిపోతున్నప్పటికీ 50.5% నుండి 40.5%కి తగ్గకుండా పెరుగుదల తోడ్పడింది. IITలలో రక్షణ సిబ్బంది పిల్లలకు సూపర్ న్యూమరరీ సీట్లు, వికలాంగ అభ్యర్థులకు రిజర్వేషన్లు కూడా ఉన్నాయి. అన్ని కులాలు, లింగాలు, సామర్థ్యాలకు ఓపెన్‌ రిజర్వేషన్ లేని సీట్లు మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. ముఖ్యంగా 2015 – 2025 మధ్య, అనేక కోర్ బ్రాంచ్‌లు అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో సీట్లను కోల్పోయాయి. వీటిలో ఎనిమిదింటిలో కెమికల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్ అండ్‌ మినరల్, మైనింగ్ ఇంజనీరింగ్ ఉన్నాయి.

ఐఐటీ రూర్కీ, ఐఐటీ ఢిల్లీలో ఎక్కువగా సీట్ల కోత

ఎనిమిది ఐఐటీలలోని అన్ని విభాగాల్లోనూ సీట్ల కోత కనిపిస్తుంది. ఐఐటీ రూర్కీలోని మెటలర్జికల్ అండ్‌ మెటీరియల్స్ ఇంజనీరింగ్‌లో తీవ్ర కోత నమోదైంది. దశాబ్ద కాలంలో దాని బిటెక్ సీట్లలో 54.55% కోల్పోవల్సి వచ్చింది. ఐఐటీ ఢిల్లీ టెక్స్‌టైల్ ఇంజనీరింగ్ విభాగంలో కూడా ఇదే విధమైన క్షీణత కనిపించింది. బయోటెక్నాలజీ, పాలిమర్ సైన్స్, ఇంజనీరింగ్ వంటి కొన్ని బ్రాంచ్‌లను ఐఐటీ రూర్కీలో నిలిపివేశారు. 2015లో బయోటెక్నాలజీలో మొత్తం 45 సీట్లు ఉన్నాయి ఉంటే అందేలో 23 సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. 2018 నాటికి ఇన్‌స్టిట్యూట్ ఈ సంఖ్యను వరుసగా 35, 15కి తగ్గించింది. 2019, 2020లో EWS కోటా పెరుగుదలకు దారితీసింది. కానీ 2021లో IIT రూర్కీ ఈ బ్రాంచ్‌ను పూర్తిగా తొలగించింది. పాలిమర్ సైన్స్, ఇంజనీరింగ్ బ్రాంచుల్లో కూడా 2015 నుంచి 2018 వరకు సీట్లలో కోతలు వచ్చాయి. ఆ తరువాత 2021లో ఈ బ్రాంచ్‌లను పూర్తిగా నిలిపివేసాయి.

ఇవి కూడా చదవండి

అంతర్జాతీయ ర్యాంకింగ్‌లలో మెరుగైన స్థానాల కోసం ఒత్తిడి, పాఠ్యాంశ సవరణ, స్టూడెంట్-టీచర్ నిష్పత్తి హేతుబద్ధీకరణ, బడ్జెట్ పరిమితులు వంటి పలు కారణాల వల్ల ఈ విధమైన మార్పులు చోటు చేసుకుంటున్నట్లు ఆయా వర్సిటీల్లో ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లు అభిప్రాయపడ్డారు. ఇందులో విధాన నిర్ణయాలు కూడా ఉన్నాయి. 2014 నుంచి 2016 వరకు IITలు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT)లలో సీట్లు ఖాళీగా ఉంటం ప్రభుత్వం గమనించింది. IIT ఖరగ్‌పూర్ డైరెక్టర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ సీట్లను తగ్గించడానికి, అలాగే డిమాండ్‌లేని కోర్సులను నిలిపివేయడానికి చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.