న్యూఢిల్లీ, జూన్ 1: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 ప్రొవిజనల్ ఆన్సర్ కీ ఆదివారం (జూన్ 2) విడుదలైంది. ఈ మేరకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ మద్రాస్) ప్రటకన వెలువరించింది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి ప్రశ్నపత్రంతో పాటు ప్రొవిజనల్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్ధుల రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టున తేదీ, మొబైల్ నంబర్ నమోదు చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 పేపర్ 1 ప్రొవిజనల్ ఆన్సర్ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 పేపర్ 2 ప్రొవిజనల్ ఆన్సర్ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్సర్ కీపై అభ్యంతరాలు లేవనెత్తడానికి జూన్ 3 సాయంత్రం 5 గంటల వరక సమయం ఇచ్చారు. అభ్యంతరాలను ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరిస్తామని ఐఐటీ మద్రాస్ స్పష్టం చేసింది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఫైనల్ ఆన్సర్ కీ రూపొందించి, ఆ వెనువెంటనే ఫలితాలు కూడా వెల్లడిస్తామని పేర్కొంది. ఐఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు జూన్ 9వ తేదీన విడుదలవనున్నాయి. ఫలితాల ప్రకటన అనంతరం ఆల్ ఇండియా ర్యాంకులు క్యాటగెరీ వైజ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాతారు.
కాగా జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష మే 26వ తేదీన ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 మొత్తం రెండు సెషన్లలో రెండు పేపర్లకు పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా ఎంత మంది హాజరయ్యారన్నది ఐఐటీ మద్రాస్ ఇంకా వెల్లడించలేదు. తెలుగు రాష్ట్రాల నుంచి 40 వేల మంది రాసి ఉంటారని అంచనా. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీలు, ఎన్‌ఐటీలలో అడ్మిషన్లు లభిస్తాయి.